కోదాడ ట్రాఫిక్ పోలీస్ ఆటో డ్రైవర్ల అవగాహన సదస్సు

Oct 4, 2024 - 13:00
Oct 4, 2024 - 17:07
 0  54
కోదాడ ట్రాఫిక్ పోలీస్ ఆటో డ్రైవర్ల అవగాహన సదస్సు

కోదాడ ట్రాఫిక్ పోలీస్ ఆటో డ్రైవర్లకు అవగాహన  వృత్తి ని గౌరవించండి, బాధ్యతగా ఉండాలి.

ప్రయాణికుల పట్ల మర్యాదగ ప్రవర్తించాలి. అన్ని అనుమతులు కలిగి ఉండాలి.

ప్రమాదంలో గాయపడ్డ వారిని అక్కడే వదలకుండా ఆసుపత్రి తరలించాలి.

కొత్త చట్టాలు కటినంగా ఉన్నాయి, రోడ్డు ప్రమాదాలు అతి తీవ్రంగా పరిగణిస్తాం.

జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, కోదాడ DSP యం.శ్రీధర్ రెడ్డిగారు,ఈరోజు కోదాడ పట్టణం లోని ప్రభుత్వ పాఠశాల నందు ఆటో డ్రైవర్లకు పట్టణ ఇన్స్పెక్టర్ రాము, RTO SK. జిలానీ, ట్రాఫిక్ SI వి. మల్లేశం పట్టణ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో 

 *పట్టణ ఇన్స్పెక్టర్ రాము గారు మాట్లాడుతూ* ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమ, నిబంధనలు, పాటించాలని ప్రజలు ఇబ్బంది పడే విధంగా వాహనాన్ని నడపకూడదని మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టాలపై రు అవగాహన కలిగి ఉండాలని చెప్పారు

 ఈ సందర్భంగా *RTO జిలానీ గారు మాట్లాడుతూ* ఆటో అనేది ప్రతి సామాన్యుడి రథం, ఆటో డ్రైవర్లు వారి వృత్తిని గౌరవించాలి, ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి, ప్రతి ఒక్కరినీ సురక్షితంగా గమ్యానికి చేర్చాలి అని అన్నారు. ఆటోలకు చట్టపరమైన అన్ని అనుమతులు కలిగి ఉండాలి, డ్రైవర్ లైసెన్స్, ఇస్యూరెన్స్ కలిగి ఉండాలి అన్నారు. నిబంధనల మేరకు డ్రైవర్ యూనిఫామ్ ధరించాలి అన్నారు. రోడ్లపై ఇతరులకు ఇబ్బంది కలిగించవొద్దు, ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపొద్దు, బాధ్యతగా నడుచుకోవాలి అన్నారు. ట్రాఫిక్ సమస్యలు సృష్టిస్తే ఆటో సీజ్ చేయడం జరుగుతుంది. మహిళల పట్ల అసబ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవు. సరదాకు ఆటోలు నడిపే వారిని గుర్తించి చర్యలు తీసుకుంటాము. పాఠశాల, కళాశాల

 *ట్రాఫిక్ SI వి మల్లేశం గారు మాట్లాడుతూ* 

 విద్యార్థినిలను తీసుకెళ్లే వారు విద్యార్థినిలను సురక్షితంగా గమ్యానికి చేర్చాలి. కొత్త చట్టాలలో రోడ్డు ప్రమాదాలను తీవ్రమైన నేరంగా పరిగణిస్తూన్నారు, ప్రమాదం జరిగితే క్షతగాత్రులను అక్కడే వదిలేయకుండా తక్షణం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలి, క్షతగాత్రులను ప్రమాదం స్థలంలో వదిలేసి పారిపోతే కటిన చర్యలు ఉంటాయి అని అన్నారు.

కాలం చెల్లిన ఆటోలను రోడ్లపై కి తీసుకురావొద్దు, వాతావరణ కాలుష్యం దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలి. అనుమానిత వ్యక్తులు ఆటోలో ప్రయాణిస్తే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలి, సమాజంలో నష్టం కలిగించే గంజాయి, గుట్కా, ఇతర నిషేధిత వస్తువులు, నకిలీ సరుకులు రవాణా చేయవొద్దు అని తెలిపినారు. ప్రయాణిస్తున్న వారు విలువైన వస్తువులు, బ్యాగ్ లు, ఇతర వస్తువులు మర్చిపోతే వారికి, లేదా పోలీసు వారికి అప్పగించాలి అని కోరినారు.

పోలీస్ కళాబృందం వారు పాటలతో ట్రాఫిక్ నియమాల గురించి అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ASI శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, రమేష్, కానిస్టేబుల్ భద్రాచలం సుధాకర్, ట్రాఫిక్ సిబ్బంది, పోలీస్ కళాబృందం ఇన్చార్జ్ యల్లయ్య, గోపయ్య, చారి, కృష్ణ నాగార్జున, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State