సింగోటం జాతర లో స్వీటు దుకాణాలలో కొలతలు తునికల అధికారుల తనిఖీలు 

Feb 4, 2025 - 19:12
 0  0
సింగోటం జాతర లో స్వీటు దుకాణాలలో కొలతలు తునికల అధికారుల తనిఖీలు 
సింగోటం జాతర లో స్వీటు దుకాణాలలో కొలతలు తునికల అధికారుల తనిఖీలు 
సింగోటం జాతర లో స్వీటు దుకాణాలలో కొలతలు తునికల అధికారుల తనిఖీలు 

వ్యాపారస్తులకు అవగాహన కల్పించిన సిసిఆర్ సంస్థ సభ్యులు చారకొండ బాబు 

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలోని సింగోటం గ్రామంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం శ్రీ శ్రీ సింగోటం లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కొలతల తూనికల జిల్లా అధికారులు సింగోటం జాతరలో తినుబండారాల, స్వీట్ దుకాణాలలో తనిఖీలు చేయడం జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా కొలుతల తూనికల జిల్లా అధికారులతో పాటు కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ ఫౌండర్ చైర్మన్ మంచి కట్ల అనిల్ కుమార్ గారి ఆదేశానుసారం, సి సి ఆర్ సంస్థ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సెక్రటరీ చారకొండ బాబు ఈ తనిఖీల్లో అధికారులతో పాటు పాల్గొనడం జరిగింది. ఈ తనిఖీలలో స్వీటు దుకాణాలలో తక్కువ తోకముతో, నెంబరు బాట్లు లేకపోవడంతో, తక్కువ తూకముతో వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులకు అపరాధ రుసుము వేస్తూ ఏడు మంది వ్యాపారస్తులపై కేసులు నమోదు చేస్తూ 7వేల రూపాయలు చలానా అపరాధ రుసుము విధించడం జరిగింది. ఇందులో భాగంగానే కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ సభ్యులు చారకొండ బాబు వ్యాపారస్తులకు అవగాహన కల్పించడం జరిగింది. వ్యాపారస్తులు ఎవరు కూడా తక్కువ తూకంతో, తక్కువ బాట్లతో వ్యాపారం చేయకూడదు అని అధికారులు మరియు సోషల్ వర్కర్లు వ్యాపారస్తులకు అవగాహన కల్పించడం జరిగింది. మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం చేయకూడదు అని వ్యాపారస్తులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా కొలతలు తూనికల జిల్లా అధికారులు మరియు కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సభ్యులు చారకొండ బాబు, మరియు వ్యాపారస్తులు ప్రజలు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333