సావిత్రిబాయి పూలే త్యాగంతోనే సమాజంలో మార్పు మొదలు అయ్యింది
సావిత్రి బాయి పూలే ఆశయాలను కొనసాగించాలి
తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ (సూర్యాపేట టౌన్ జనవరి 3) సావిత్రిబాయి పూలే త్యాగాలతోనే సమాజంలో మార్పు మొదలు అయిందని తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా పంతంగి వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ స్వాతంత్ర దేశంగా అవతరించక ముందే దేశంలో ఉన్న అణగారిన సమాజం కోసం, స్త్రీల హక్కుల కోసం విద్య కోసం మహాత్మ జ్యోతిరావు పూలే దంపతులు సామాజిక రాజకీయ సాంస్కృతిక పరివర్తన కోసం పోరాటం చేశారని వారి పోరాట ఫలిత మూలంగానే నేడు స్త్రీలు స్వేచ్ఛ సమానత్వ సోదరభావ హక్కులు పొందుతూ చదువుకోగలుగుతున్నారని తెలిపారు.అందులో భాగంగానే మహాత్మా జ్యోతిరావు పూలే భార్య అయిన సావిత్రిబాయి పూలే కృషి త్యాగం పోరాటం మూలంగానే నేడు మహిళలు విద్యను అభ్యసించే హక్కును పొందుతున్నారని తెలిపారు.నాడు సావిత్రిబాయి పూలే చేసిన కృషి, త్యాగం మూలంగానే నేడు ఆధునిక భారతదేశ చరిత్రలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా చరిత్రకి ఎక్కడమే కాకుండా నిజమైన చదువుల తల్లిగా పిలువబడుతూ మేధావులు చేత, విద్యావంతుల చేత,సామాన్యుల చేత మన్ననలు పొందుతున్నారని అన్నారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో, ఖండాలా తాలూకాలోని నయాగావ్ గ్రామంలో జనవరి 3 న 1831 లో సావిత్రిబాయి జన్మించింది.ఆనాటి సామాజిక కట్టుబాట్ల దృష్ట్యా తన తొమ్మిదవ యేటనే జ్యోతిరావు పూలేతో సావిత్రిబాయికి వివాహం జరిగిందని పూలే దంపతులకి వివాహమైన తదనంతరం సాంప్రదాయక జీవితంలో భాగంగా పిల్లలు కనాలని ఆలోచన లేకుండా సమాజంలో వెనుకబాటుకి గురవుతున్న పీడితులే తమ బిడ్డలుగా భావించి సొంత బిడ్డల్ని కూడా లేకుండా అణగారిన సమాజం కోసం,మహిళల అభ్యున్నతి కోసం సామాజిక రాజకీయ పోరాటాలు చేశారని అన్నారు.మహిళల సామాజిక రాజకీయ హక్కుల కోసం, మహిళల విద్య కోసం పూలే దంపతులు మనో సంకల్ప బద్ధులై మొట్టమొదటిసారిగా 1848 లో పూణేలో ఒక ఇంట్లో బాలికల పాఠశాలను ప్రారంభించారు. నిరక్షరాస్యులైన సావిత్రిబాయిని మహాత్మా జ్యోతిరావు పూలేనే స్వయంగా విద్యావంతురాలని చేసి తాము స్థాపించిన పాఠశాలకి ప్రధాన మహిళా విద్యావంతురాలని చేశాడు. వారి స్థాపించిన మొదటి పాఠశాలలో 9 మంది విద్యార్థులు చేరగా వారికి సావిత్రిబాయి పూలే గారే ప్రధానోపాధ్యాయురాలు.వీరు స్థాపించిన మొదటి పాఠశాల ఆరు నెలలపాటు కొనసాగి మూతపడింది. కొన్ని నెలల తర్వాత మరొక భవనంలో మళ్లీ పాఠశాలని ప్రారంభించారు, అది నిర్వహిస్తున్నందుకుగాను నాటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా తీవ్రమైన వ్యతిరేకతని పూలే దంపతులు ఎదుర్కొన్నారని తెలిపారు.సమాజం లో మార్పు ఉపాధ్యాయ వృత్తి తోనే సాధ్యం అవుతుందని మహాత్మా జ్యోతి బాపూలే తన భార్య ని టీచర్ గా మార్చారని తెలిపారు. ఆమెను స్ఫూర్తి గా తీసుకొని ఆమె అడుగుజాడల్లో మనమందరం నడుస్తూ సమాజం లో మార్పు తేవటానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించాలని తెలిపారు. ఉపాధ్యాయులు బడికి రాని పిల్లలని గుర్తించి తల్లిదండ్రుల ద్వారా వారిని బడికి పంపించేలా చూడాలని, అలాగే జిల్లాలో అక్షరాస్యత పెంచాలని సూచించారు.విద్యార్థులను సోషల్ మీడియా కి, మొబైల్ ఫోనులకి దూరంగా ఉండేలా అవగాహన కల్పించి వారికి అర్ధం అయ్యేలా పాఠాలు భోధించి వారిని జీవితంలో ఉన్నత స్థాయి కి ఎదిగేలా చూడాలని పంతంగి వీరస్వామి గౌడ్ తెలిపారు. ఆయనమాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి గొప్పదని వారితోనే సమాజం మార్పు సాధ్యం అవుతుందని సావిత్రి బాయి పూలే అడుగుజాడల్లో నడుస్తూ విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ అధ్యక్షుడు జలగం సత్య గౌడ్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు పట్టేటి కిరణ్ మండాది గోవర్ధన్ రేసు నాగయ్య పెగ్గేపురం నరసయ్య చిలువేరు రమేష్ మారుతి సారగండ్ల కోటేష్ దండి వెంకటరెడ్డి రాపర్తి జానయ్య ఖమ్మం పార్టీ అంజయ్య సోమయ్య నిలయ తదితరులు పాల్గొన్నారు..