సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన కొత్త వెంకట్ రెడ్డి

Dec 22, 2025 - 20:58
Dec 23, 2025 - 12:25
 0  262
సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన కొత్త వెంకట్ రెడ్డి

22-12-2025 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం: చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం  గ్రామంలో ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచ్ కొత్త వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్ సింగోటం శోభ  మరియు వార్డు సభ్యులు.

 మొదటగా గ్రామ పంచాయతీ సెక్రెటరీ విక్రమ్ యాదవ్ సర్పంచ్ కు, ఉప సర్పంచ్ కు, వార్డ్ నెంబర్లకు అందరికీ శాలువాలు కప్పి సన్మానం చేయడం జరిగింది.

 విక్రమ్ యాదవ్ మాట్లాడుతూ ఇన్ని రోజులు గ్రామంలో సర్పంచులు లేక నేను చాలా ఇబ్బందులు పడ్డాను ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నా డ్యూటీ చేస్తూ ఈ గ్రామ సర్పంచ్ డ్యూటీ కూడా నేనే చేసే వాడిని కాబట్టి ఈరోజు నుండి సర్పంచ్ గ్రామ సేవకుడిగా, నేనేమో గ్రామానికి తోడుగా ఉండి గ్రామ అభివృద్ధికి తోడ్పాటు గా ఉంటాను అని చెప్పడం జరిగింది.

  సర్పంచ్ కొత్త వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నామీద నమ్మకం ఉంచి గ్రామ ప్రజలు నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని *భారత రాజ్యాంగం* పై నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భయము పక్షపాతం, రాగదేశాలుగాని లేకుండా రాజ్యాంగాన్ని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని అన్నారు.

 శ్రీశైలం నిర్వహితుల గురించి మాట్లాడుతూ శ్రీశైలం నిర్వాసితులు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాల చుట్టూ తిరిగిన, ఫలితం శూన్యంగా ఉంది, జూపల్లి కృష్ణారావుకు శ్రీశైలం నిర్వహితుల గురించి అంతా తెలిసిన తెలవనట్లు నటిస్తూ శ్రీశైలం నిర్వహితుల సమస్యలకు మొదటి కారకుడుగా నిలిచాడు ఈరోజు.

 నా ప్రయత్నం నేను చేస్తూ మీకు ఉద్యోగాలు వచ్చేవరకు ప్రభుత్వాన్ని మెడలు ఉంచడమే నా లక్ష్యం అంటూ శ్రీశైలం నిర్వహితుల కు నేను అండగా ఉంటానని మాట ఇవ్వడం జరిగింది.

 అదేవిధంగా *ఉపసర్పంచ్ వార్డు సభ్యులను గ్రామపంచాయతీ సెక్రటరీ* గారు ప్రమాణం చేయించడం జరిగింది.

తదననంతరం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తోట బాలకృష్ణ మాట్లాడుతూ

 గూడెం  గ్రామపంచాయతీ ప్రమాణ స్వీకారానికి హాజరైన గ్రామ ప్రజలందరికీ బిజెపి, టిఆర్ఎస్  పార్టీ కార్యకర్తలకు నాయకులకు మన పార్టీ పై నమ్మకం ఉంచి కొత్త వెంకట్ రెడ్డిని  గారిని 44 ఓట్ల మెజారిటీతో గెలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. కాంగ్రెస్ పార్టీల కలిబొల్లి మాటలు చెప్పి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా చెప్పుతూ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు. కాబట్టి వారి మాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు.

 అదే విధంగా ఊర్లో ఉండే సమస్యలపై కొత్త సర్పంచ్ గారికి చాలా వివరంగా వివరించారు.

 తక్షణమే కొత్త సర్పంచ్ కూడా మేము తొందర్లోనే సమస్యలపై ఫోకస్ చేసి త్వరలోనే సమస్యలను పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, రైతన్నలు, గ్రామపంచాయతీ సిబ్బంది,   పార్టీ కార్యకర్తలు నాయకులు మరియు శ్రీశైలం నిర్వాసితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State