సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న టీవీ సీరియల్ లు సినిమాల పైన ప్రభుత్వం ఉక్కు పాదం మోపాలి

సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న టీవీ సీరియల్ లు సినిమాల పైన
ప్రభుత్వం ఉక్కు పాదం మోపాలి.తేనె పూసిన కత్తిలాంటి సినిమా రంగం పట్ల జాగ్రత్త.
సామాజిక ప్రయోజనాన్ని విస్మరించి సినిమాలు నిర్మిస్తే
మెతక వైఖరి అవసరమా. పేద ప్రజానీకం శ్రమతో కోట్లు దండుకోవడమేనా సినిమా రంగం పని..
వడ్డేపల్లి మల్లేషము
29...10...2024
తాత్కాలిక లక్ష్యాలు మారుతుండవచ్చు కానీ శాశ్వత ప్రయోజనాలు మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటాయి సినిమాలు సీరియల్ నిర్మాణంతో సమాజానికి ఎంతో కొంత మేలు జరగాలి సమాజంలో నెలకొన్నటువంటి సామాజిక రుగ్మతలను దృడ హస్తంతో అణచివేసే విధంగా సినిమాలు సీరియల్లు ఉండాలి కానీ లేని ప్రలోభాలను కుట్రలు కుతంత్రాలను నేర్పే విధంగా ఉంటే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకుంటే ఇక పట్టించుకునే వాళ్ళు ఎవరు? నష్టం జరుగుతుందని ప్రజా వ్యతిరేక విధానాలను ప్రోత్సహిస్తున్నాయని తెలిసి కూడా సెన్సార్ బోర్డులు మందలించకుంటే ప్రభుత్వాలు నిషేదించకుంటే సమాజానికి వీటివల్ల నష్టమే ఎక్కువ .ఇంత తెలిసినా కూడా ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో ఐదారు దశాబ్దాలకు పూర్వం కొంత సినిమాల యొక్క పరిస్థితి ప్రయోజనకరంగా ఉండేది సీరియల్ కూడా ఇప్పుడున్నంత స్థాయిలో దిగజారిన పద్ధతిలో లేకుండే. కానీ గత 15 సంవత్సరాలుగా ముఖ్యంగా సీరియల్ లను గమనిస్తే 20, 30 సంవత్సరాలుగా సినిమాలను గమనించినప్పుడు ప్రయోజనం కలిగించే ప్రసారాలు నామ మాత్రమే అని చెప్పవచ్చు. పైగా సినిమా హీరోలకు ఫ్యాన్స్ పేరుతో దేశవ్యాప్తంగా యువతను సమీకరించి ఆలోచన సృజనాత్మకత వైపు కాకుండా మొక్కుబడిగా హీరోలను నటులను నటి మనులను ఆరాధించడానికి మాత్రమే పరిమితమైనటువంటి వ్యవస్థను చూస్తూ ఊరకుండడం ప్రభుత్వాలు కూడా బాధ్యతను విస్మరించడమే. అంతే కాదు సామాజిక ప్రజా సంఘాలు మేధావులు బుద్ధి జీవులు ప్రజా హక్కుల సంఘాలు కూడా ఇంత జరుగుతున్నా మౌనంగా ఉండడం సమాజానికి ద్రోహాన్ని తలపెట్టడమే బాధ్యతను విస్మరించడమే అవుతుంది.
తేనె పూసిన కత్తి లాగా ఆకర్షణతో :-
వందలు వేల కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టి, ఆకర్షణ నమ్మించే ప్రయత్నం చేసి, అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగినటువంటి సన్నివేశాలు సెట్టింగులతో అబూత కల్పనలను సృష్టించి ఇదే నిజమైన జీవితమని ఇది నిత్యజీవితంలో సాధ్యమని కథా రచయితలు నటులు సినిమాలు టీవీ ప్రసారాల ద్వారా ప్రజల్లో ప్రజల మెదలలోకి నింపుతూ ఉంటే సినిమా రంగాన్ని తేనె పూసిన కత్తి లాగా ప్రజలు అంగీకరించడం విచారకరం. మోసపోవడం తొక్కిసలా టలు జరిగి ఎంతో మంది చనిపోవడం ఆ చనిపోయిన సందర్భంలో నటులు, ప్రభుత్వాలు ఆ కుటుంబానికి లక్షలు కోట్లాది రూపాయలను చెల్లించడం ఇదంతా సీరియల్ గా జరుగుతుంటే ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర వహించడం అవసరమా.? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం నడిచిన కాలంలో సినిమాల్లోనూ టీవీ ప్రసారాలలోనూ అనుచిత వ్యాఖ్యలు, సంభాషణలు, కథలు చోటుచేసుకున్నాయని, ప్రజల భాషకు భిన్నంగా అవమానపరిచే విధంగా ఉన్నదని, సామాజిక ప్రయోజనం లేనటువంటి వాటిని ఖండించాలని, అలాంటిది ఉమ్మడి రాష్ట్రంలో జరగలేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దానిని సా కారం చేసుకోవాలని ఉద్యమ కాలంలో ప్రజా సంఘాలు మేధావులు టిఆర్ఎస్ పార్టీ కూడా గొప్పగా చెప్పుకున్నప్పటికీ తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుండి 2023 వరకు ఏనాడు కూడా కనీసం ఒక్కనాడు అయినా వాటిపైన సమీక్ష జరగలేదు. సినిమాలు టీవీ ప్రసారాలపైన ఆలోచించడానికి కూడా అవకాశం సమయం చిక్కనటువంటి ప్రభుత్వాలు ఏ రకంగా ప్రజల కోసం పనిచేస్తాయో ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమ కాలంలో ఎందుకు హామీలు ఇచ్చినాయో తమను తాము ప్రశ్నించుకోవాలి, ఆలోచించుకోవాలి. కొద్దిమంది నటులు నిర్మాతలు దర్శకులు, సిబ్బంది కోసం వాళ్ల లాభాలు కోట్లకు ఎదగడం కోసం లక్షలాది మంది ప్రజలు చెమట వడిసి కష్టించి ఎక్కువ రేట్లు పెట్టి సినిమాలు చూసి వాళ్ల జేబులు నింపడానికే నా ఈ వ్యవస్థ కొనసాగేది? ఇంత జరుగుతుంటే ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర వహిస్తుంటే ప్రభుత్వాలకు సినిమా టీవీ రంగాల వారికి గూడుపుఠాణి ఉన్నది అనుకుంటే అభ్యంతరం ఏమిటి? అప్పుడప్పుడు సినిమా రంగాలకు చెందిన వాళ్లు ప్రభుత్వాలతో సంప్రదించి బొకేలు సన్మానాలతో తృప్తి పరిచినంత మాత్రాన సమాజానికి జరుగుతున్న అన్యాయం న్యాయమవుతుందా? నష్టం సామాజిక ప్రయోజనంగా మారుతుందా? పాలకులు కూడా పెట్టుబడిదారుల వైపే అనే విషయం ప్రజలు గుర్తిస్తేనే కానీ ప్రతిఘటన, పరిష్కారం సాధ్యం కాదు.
తప్పుడు విధానాలపై ఉక్కు పాదం మోపాలి. కానీ పెట్టుబడిదారుల ప్రయోజనం ముఖ్యం కాదు:-
ప్రభుత్వాలకు ప్రతి రంగం పైన స్పష్టమైన విధానం అవసరం వి దానపరమైన ప్రకటనను బట్టి ఆ ప్రభుత్వం యొక్క పని విధానాన్ని కొలవడానికి ఆస్కారం ఉంటుందని నిపుణులు, మేధావులు, సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సమాజంతో సంబంధం లేనటువంటి అంశాలను కథా వస్తువులుగా ఎంపిక చేసుకొని పెద్దపెద్ద సెట్టింగులతో ఆచరణ సాధ్యం కాని వాటిని ఆకాశానికి ఎత్తి చూపినప్పుడు అందులోని అ వాస్తవికత ప్రభుత్వాలకు కనిపించడం లేదా? సీరియలలోనైతే ప్రతిదీ జీవితానికి వ్యతిరేకం తోటి కుటుంబానికి వ్యతిరేకం కుట్రలు కుతంత్రాలతో నష్టపెట్టే ధోరణి్లో సంభాషణలు ఈ రచయితలు ఎవరి ప్రయోజనం కోసం రాస్తున్నారో పాలకులకు ఆలోచించడానికి తీరిక లేదా? సినిమాలు టీవీ ప్రసారాలలో అర్థనగ్న దృశ్యాలు, అవమానకరమైనటువంటి సన్నివేశాలు, మధ్యపానమత్తు పదార్థల ప్రదర్శన, వ్యతిరేక ఆలోచనలను కలిగించి సమాజానికి నష్టం చేసే అభిప్రాయాలు బలపడే విధంగా ఉంటున్నటువంటి సంభాషణలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ అంశం పైన కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్కడికక్కడ విజ్ఞులు ఆయా రంగాల నిపుణులు సామాజికవేత్తలతో కమిటీలను వేసి సినిమాలు టీవీ ప్రసారాలు ఏ రకంగా ఉండాలి? తప్పుడు విధానాలకు పాల్పడితే తగిన చర్యలేమిటి? మానవీయ కోణంలో రావలసినటువంటి పరిణామాలు ఏమిటి? రోజురోజుకు పెరుగుతున్న సామాజిక రుగ్మతలను కట్టడి చేయడం ఎలా? మద్యం మత్తు పదార్థాలు ధూమపానం క్లబ్బులు, పప్పులు ఈవెంట్లను నిజజీవితంలోనూ సినిమాల్లోనూ చూపించకుండా ఉండడానికి సిఫారసులు ఏమిటి? అని ఆ కమిటీలకు ప్రభుత్వాలు మార్గ నిర్దేశం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎంతసేపు పరిపాలన అంటే డబ్బుల పంపిణీ అనుకుంటున్నటువంటి ప్రభుత్వాలు సంస్కృతిని మార్చకుండా, ప్రజల ఆలోచనలు అలవాట్లను సరైన దారిలో పెట్టకుండా, చెడు మార్గాలను కట్టడి చేయకుండా, స్వార్థపూరిత ప్రయోజనాలకు సంబంధించినటువంటి సన్నివేశాలపై ఉక్కు పాదం మోపకుండా ప్రయోజనాన్ని ఆశించలేము. స్థానికంగా విద్యావంతులు మేధావులు విజ్ఞతకల యువతతో కమిటీలను ఏర్పాటుచేసి యువత పెడదారిపట్టకుండా గుడ్డిగా అభిమానసంఘాలు బలపడకుండా యువత పెడదారి పట్టకుండా చూడాలి. వాటి నిర్మాతలు దర్శకులు, సిబ్బంది పైన కూడా చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాల ఆలోచన ఉండాలి. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం కూడా సెన్సార్ బోర్డుల నిర్మాణంలో సామాజికవేత్తలు వివిధ రంగాల నిపుణులతో సమాజ అవగాహన కలిగిన వాళ్లను నియమించినప్పుడు మాత్రమే వీటిని సమాజానికి ఉపయుక్తంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. లేకుంటే పెద్ద మొత్తంలో సమాజాన్ని మార్చగలిగే సినిమాలు టీవీలలో ప్రసారమయ్యే అంశాలు త ప్పుల నడక ఉన్నప్పుడు సమాజం మొత్తము అంధకారమవుతుంది. దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వాలు వహించవలసి ఉంటుంది అంత దూరం పోకముందే ప్రభుత్వాలు సోయి తెచ్చుకొని తమ బాధ్యత గుర్తించి నిర్మాణాత్మక పాత్ర పోషించాలి.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)