సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించాలి
తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ;తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.
(నవంబర్ 10 /సూర్యాపేట టౌన్) సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. ఆదివారం అర్వపల్లి మండలంలోని తిమ్మాపురం గ్రామంలో తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్ వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన కొండ ఎల్లమ్మదేవత పండగకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. పల్లెల్లో ఉన్న ప్రజలు ఆనవాయితీగా ప్రతి ఏడాది గ్రామ దేవతలను పూజిస్తూ పండగలు చేసుకోవడం తెలంగాణలో ఎక్కువగా సంస్కృతి ,సంప్రదాయం ఉట్టిపడేలా ఉంటాయని చెప్పారు. తెలంగాణ ప్రజానీకం సుఖ సంతోషాలతో ఉండాలని దేవతను కోరుకున్నట్లు చెప్పారు. ప్రజలు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఆధ్యాత్మిక చింతనను కూడా అలవర్చుకొని దైవ మార్గంలో పయనించాల్సిన అవసరం ఉందన్నారు. ఆధ్యాత్మికత మూలంగా సమాజంలో శాంతి నెలకొల్పడానికి అవకాశం ఉంటుందన్నారు. కొండా ఎల్లమ్మదేవత పండగకు హాజరైన పలువురికి నిర్వాహకులు మారుపెద్ది శ్రీనివాస్ గౌడ్ శాలువాలతో ఘనంగా సన్మానించి ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు మండాది గోవర్ధన్ గౌడ్, జిల్లా కోశాధికారి పాల సైదులు, కీర్తి ఎలమంచయ్య ,దేశగాని లింగయ్య తదితరులు పాల్గొన్నారు