శ్రీ తిమ్మప్ప స్వామి హుండీ ఆదాయం రూ.25,62,300
జోగులాంబ గద్వాల 18 జనవరి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- మల్దకల్ మండల కేంద్రంలో ఉన్న శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం హుండీని శుక్రవారం లెక్కించగా హుండీ ఆదాయం రూ.25,62,300 లభించిందని దేవాలయ చైర్మన్ పట్వారి ప్రహల్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి తెలిపారు.
గత ఏడాది రూ.24,07,139 కాగా ఏడాది అధికంగా రూ.1,55,171 ఆదాయం లభించినట్లు తెలిపారు. అలాగే చింతల ముని దేవాలయం హుండీ లెక్కించగా రూ.1,32,406 రాగా గత ఏడాది రూ.1,08,406 తో ఈసారి రూ.23,556 ఆదాయం లభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరమ్మ పర్యవేక్షణలో జరగగా పలువురు భక్తులు పాల్గొని లెక్కించారు.స్వామివారి లడ్డు ప్రసాదం క్యాలెండర్ వస్త్రము... సేవకులకు ఇవ్వడం జరిగింది.