6సెల్ ఫోన్లు రికవరీ.. యజమానులకు అప్పగింత.
ఎస్సై నందికర్ఫోన్లను యజమానులకు అప్పగించిన ఎస్సై.

జోగులాంబ గద్వాల 18 జనవరి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- మల్దకల్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో గత డిసెంబర్ నెలలో పోగొట్టుకున్న 6 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధిత యజమానులకు అప్పగించినట్లు స్థానిక మండల ఎస్ఐ నందికర్ శుక్రవారం తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం...మండల పరిధిలో సెల్ ఫోన్స్ పోగొట్టుకున్న వారి ఫోన్స్ సి ఈ ఐ ఆర్ అప్లికేషన్ ద్వారా 6 ఫోనులను ట్రేస్ చేసి ఫోన్స్ ను ఆ యజమానులను స్టేషన్కు పిలిపించి యాజమానులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఎవరైనా తమ సెల్‌ఫోన్ పోగొట్టుకున్నా.. చోరీకి గురైనా సీఈఐఆర్ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలను పొందుపరుచాలని సూచించారు