శిలాజ ఇంధన వనరుల వాడకాన్ని తగ్గిస్తే  ప్రపంచ స్థాయిలో హరిత కొలువులు  భారీగా పెరుగుతాయి.

Apr 6, 2026 - 07:25
 0  1

ప్రపంచ పునరుత్పాదక  ఇందల వనరుల  ఏజెన్సీ ప్రకటించిన నివేదిక సారాంశం ఇదేనా ?అవును పర్యావరణానికి ద్రోహం తలపెట్టనిదే అవసరం.

---  వడ్డేపల్లి మల్లేశం

శాస్త్ర సాంకేతిక ఇంజనీరింగ్  పరిశ్రమలు ఉత్పత్తి  రంగాలలో వినియోగించే  శక్తి నేటి  ఉత్పత్తికి అభివృద్ధికి ప్రామాణికంగా నిలిచింది. గత అనేక దశాబ్దాలుగా శిలాజ ఇంధనాల వాడకం పైన ఆధారపడి  పరిశ్రమలను  యంత్రాలను  వినియోగించుకొని ఉత్పత్తులు కొనసాగించడం జరిగింది .కాలానుగుణంగా  శిలాజ ఇంధన వనరుల యొక్క  నిలువ తగ్గిపోవడం  వాటి వినియోగంతో  ప్రకృతి పర్యావరణం విష  తుల్యం కావడం  అంతేకాదు వీటి ఉత్పత్తి భారీ ఖర్చుతో కూడుకున్న కారణంగా కూడా ప్రత్యామ్నాయ ఇంధనవనరుల పైన దృష్టి సారించాల్సిన అవసరం ప్రపంచ దేశాలకు ఏర్పడింది.ఈ క్రమంలో శాస్త్ర సాంకేతిక రంగాలలోని నిపుణులు శాస్త్రవేత్తలు ఇంజనీర్లు  పర్యావరణానికి ద్రోహం తలపెట్టని రీతిలో ఉండే విధానాలను కొనసాగించే క్రమంలో  సౌర, పవన, హైడ్రో, బయో ఎనర్జీ పునరుత్పాదక  విధానాలు  ప్రాచుర్యంలోకి వచ్చాయి.

 అయితే తొలి దశలో వీటి యొక్క ప్రయోగాత్మక  పరిస్థితుల్లో ఉత్పత్తి అంతగా ఉండకపోయినప్పటికీ దీర్ఘకాలిక కాలంలో  తద్వారా సాధించినటువంటి ఉత్పత్తులు గణనీయంగానే ఉన్నట్లు అంతేకాకుండా అనేక మందికి ఉపాధి కల్పించే విషయంలో ముందున్నట్లుగా మనకు నివేదికల ద్వారా తెలుస్తున్నది.  పెట్రా అనగా రాయి ఓల్యం అంటే నూనె అని అర్థం అని చిన్న నాడు పాఠ్యపుస్తకాలలో చదువుకున్నాం .ఇరాన్ ఇరాక్, సౌదీ దుబాయ్ రష్యా లాంటి ఇతర కొన్ని  పెట్రోలియం ఉత్పత్తి దేశాలు ప్రత్యేకంగా  ప్రపంచంలోని ఇతర దేశాలకు ఇంధన వనరులను ఉత్పత్తి  ఎగుమతి చేయడం ద్వారా నేడు ప్రపంచ వ్యవస్థ కొనసాగుతున్నది. అయితే  అనేక సందర్భాల్లో దేశాల మధ్యన యుద్ధాలు తలపడినప్పుడు  తమ ఉత్పత్తులను నిలుపుదల చేయడం,  ఎగుమతి చేయకపోవడం లేదా భారీగా ధరలు పెంచడంతో వీటి పైన ఆధారపడినటువంటి పేద దేశాలు చాలా నష్టపోవలసినటువంటి సందర్భాలు వస్తున్నాయి.  ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని  పరిమితంగా ఉండే వనరులైనటువంటి శిలాజ ఇంధన వనరులను కూడ కాపాడుకునే క్రమంలో ప్రత్యామ్నాయవనరుల పైన దృష్టి సారించవలసినటువంటి అవసరం ప్రపంచ దేశాలకు ఏర్పడింది.

 తద్వారా  ఉత్పత్తిని పెంచుకోవడం  చౌకగా ఉత్పత్తి చేసుకోవడంతో పాటు లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలను గణనీయంగా పెంచడానికి ఈ విధానాలు తోడ్పడినట్లుగా ప్రపంచ నివేదిక ద్వారా తెలుస్తున్నది .ప్రపంచ పునరుత్పాదక ఇంధన వనరుల ఏజెన్సీ తన 2024 నివేదికలో  తెలిపిన విధంగా  పునరుత్పాదక ఇంధన వనరుల  ఉత్పత్తి వినియోగ రంగంలో పని చేస్తున్నటువంటి ఉద్యోగుల యొక్క సంఖ్య 2012లో  0.73 కోట్లు ఉంటే  2023 సంవత్సరం నాటికి  ఉద్యోగుల సంఖ్య ఒక కోటి 62 లక్షలకు  చేరినట్లు తెలుస్తూ ఉన్నది. అంటే ఈ రంగము ద్వారా ఉద్యోగుల యొక్క సంఖ్య కూడా పెరగడానికి,ఉపాధి అవకాశాలు మెరుగు పడటానికి,  ప్రత్యామ్నాయ ఇంధన వనరుల విధానం తోడ్పడినట్లే కదా! అంతేకాకుండా ఈ విధానంలో తయారై వినియోగించ బడి నటువంటి శక్తి  పర్యావరణ విచ్చిన్నానికి  కాలుష్యానికి ఏ మాత్రం  కారణం కాకపోగా సురక్షితమైన పద్ధతిలో కొనసాగడం వలన  ప్రపంచ మానవాళికి భవిష్యత్తులో ఎదురయ్యే అనేక సవాల్ల ను అధిగమించడానికి తోడ్పడుతుందని విశ్లేషకులు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

శిలాజ ఇంధన వనరుల వాడకంతో పర్యావరణానికి చేటు కలుగుతుంది  ఇందులో ఉండేటువంటి క్లోరో ఫ్లో  ఫ్లోరో కార్బన్స్ వాతావరణాన్ని వేడెక్కించడంతోపాటు  అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నట్లు  వాతావరణం భారీగా వేడెక్కినప్పుడు సముద్ర జలాలు కూడా ఉప్పొంగిపోయే ప్రమాదం కూడా ఉంటుందని తద్వారా అనేక విషపరిణామాలకు దారి తీయవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  అయితే ప్రపంచంలోని పెట్రోలియం ఉత్పత్తి దేశాలకు ప్రధాన ఆదాయ ఇంధన వనరుగా ఉన్నటువంటి ఈ  సంపద పైన  దృష్టి సారించడం వలన  దేశాల మధ్యన ఒప్పందాలు లేదా  బలవంతపు ఆదేశాల వలన కూడా అనివార్యంగా దీని వినియోగం పెరగడం వల్ల కొన్ని అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ అనర్థాలను దృష్టిలో ఉంచుకొని ఇకముందు అయినా  శిలాజ ఇంధన వనరుల వినియోగాన్ని ఉత్పత్తిని క్రమంగా తగ్గిస్తూ  ప్రతి దేశంలోనూ ప్రత్యామ్నాయ ఇందన వనరుల పైన నీటిపై గాలిపై  సౌర విద్యుత్తు పైన ఆధారపడినటువంటి యంత్రాలు వాహనాలు యంత్ర పరికరాలు  ఉత్పత్తి చేసుకోవడం ద్వారా తమ ఉత్పత్తులను వేగవంతం చేసుకుంటే  పర్యావరణానికి డోకా ఉండదు.  ప్రజల అనారోగ్యానికి ఏ రకంగానూ కారణం కాదు కూడా.

కొన్ని గణాంకాలను పరిశీలిస్తే

శాస్త్ర సాంకేతిక రంగాల్లో వాస్తవమైనటువంటి అంశాలలో నైపుణ్యం కలిగినటువంటి శాస్త్రవేత్తలు  కొన్ని  అంశాలపై వాటి వినియోగం ద్వారా లభించే లాభాలను నష్టాలను నిక్కచ్చిగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ కేవలం పరిశోధన ఫలితాలను ప్రకటిస్తే  ప్రయోజనం ఏముంటుంది?  అందుకే సాధ్యా సాధ్యా లు వాటి వల్ల రాబోయే ప్రమాదాలను హెచ్చరిక రూపంలో ప్రపంచ దేశాలకు అందించినప్పుడు మాత్రమే ప్రపంచాది నేతలు కూడా తమ ప్రజలను కాపాడుకునే క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు అనేది జగమెరిగిన సత్యం.  2012లో  సౌర పలకల పైన ఆధారపడినటువంటి విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి రంగంలో 13 1/2 లక్షల ఉద్యోగులు పనిచేస్తూ ఉంటే  2023 నాటికి సౌర పలకల ద్వారా విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన రంగంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 71 లక్షలకు చేరుకున్నది. అదే బయో ఎనర్జీ రంగంలో  2012లో 24 లక్షల మంది ఉంటే  12 ఏళ్ల తర్వాత దాదాపు 39 లక్షల ఉద్యోగాలకు చేరుకోవడం ఎంతో మందికి ఉపాధి కల్పించడమే కదా!  ఇక పవన విద్యుత్తుకు సంబంధించి 2012లో 7.5 లక్షల మంది ఉద్యో  ఉద్యోగులు ఉంటే  12 ఏళ్ల తర్వాత ఆ ఉద్యోగుల సంఖ్య 15 లక్షలకు చేరుకున్నది  హైడ్రో పవర్ లోపల 16 1/2 లక్షల మంది ఉంటే 2023నాటికి23 లక్షలకు చేరింది. ఉద్యోగులుదృష్టి సారించడం వలన ఆ రంగాలు అభివృద్ధి చెంది ఆయా రంగాల్లో కొలువులు పొందిన వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది అంటే దేశాలు అభివృద్ధి చెందినట్లు కాదా? 2012లో 0.73కోట్లు ఉంటే  2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా 1కోటి 62లక్షల ఉద్యోగుల సంఖ్య పెరిగినట్లుగా గణాంకాలు తెలియజేస్తున్నాయి  అంటే  పునరుత్పాదక ఇంధన వనరుల వైపు ఆయా దేశాలు ద్రుష్టి సారించడం వల్లనే కదా!
(ఈ ఆశ కర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ  )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333