ముoచుకొస్తున్న ప్లాస్టిక్ ప్రమాదం  అంతర్జాతీయ స్థాయిలో  కఠిన చర్యలతోనే సాధ్యం.

Mar 9, 2026 - 04:56
 0  0

ముoచుకొస్తున్న ప్లాస్టిక్ ప్రమాదం  అంతర్జాతీయ స్థాయిలో  కఠిన చర్యలతోనే సాధ్యం.

ప్రజలు కూడా  తమ సామాజిక బాధ్యతను  విస్మరించకూడదు.

రాబోయే తరా లకు  ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత కదా ,!

---- వడ్డేపల్లి మల్లేశం 


ప్రధానంగా శిలాజ ఇంధనాలను ప్లాస్టిక్లను కట్టడి చేయాల్సిన అవసరం చాలా ఉంది.  భవిష్యత్తు తరాల ప్రయోజనం కోసం  కఠిన చర్యలు  తీసుకోవడం అవసరమని ఒకవైపు అంతర్జాతీయ న్యాయస్థానం హెచ్చరిస్తుంటే  ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు, చ ము రు ఉత్పత్తి దేశాలు కలిసి రాకపోవడం  కొంత అవరోధం అయినప్పటికీ  జెనీవా సభలో  పెట్టుబడి దారి దేశాలు అంగీకరించక పోయినప్పటికీ ఈ అంశం పైన అంతర్జాతీయ స్థాయిలో సంప్రదింపులు మాత్రం తప్పనిసరిగా జరగాల్సిన అవసరం ఉన్నదని  uno ప్రధాన కార్యదర్శి గూటరస్ ఆందోళన వ్యక్తం చేయడం ఈ అంశం యొక్క తీవ్రతను తెలియజేస్తున్నది.  ప్లాస్టిక్ వ్యర్థాలను తగలబెట్టడం ద్వారా తాత్కాలికంగా లేకుండా చేసినప్పటికీ  దీర్ఘకాలికంగా మరిన్ని హానికర రసాయనాలు వాతావరణంలో చేరే ప్రమాదం ఉన్నదని  దీనికన్నా ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్ వినియోగించడం లేదా  పరిమితం చేయడం  నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తిగా నిర్మూలించే చర్యలు చేపట్టడమే  ఉత్తమ మార్గమని పర్యావరణ  బృందాలు ఒకవైపు హెచ్చరిస్తున్నాయి  .ధనిక దేశాలు తమ ప్లాస్టిక్ వ్యర్థాల చెత్తను  పేద దేశాలకు తరలించడం  వలసగా మారిందని  పేద దేశాల్లో ఆరోగ్యం పైన పెను ప్రభావం పడే ఆస్కారం ఉన్నందున  అనుగుణమైనటువంటి టెక్నాలజీని  పేద దేశాలకు అందించడం ద్వారా ఎక్కడికక్కడ  అదుపు చేయడమే  పరిష్కారమని ఈ పర్యావరణ బృందాలు  సిఫారసు చేయడాన్ని వివిధ దేశాల పాలకులు గమనించాలి ఆచరించాలి .


    ప్లాస్టిక్ వ్యర్థాలు-  సంభవిస్తున్న  పరిణామాలు-  కొన్ని గణాంకాలు

ప్లాస్టిక్ వినియోగం వల్ల కేవలం  అనారోగ్యం బారిన పడి  ప్రజలు  ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఆయా దేశాల యొక్క  ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పగూ లుతున్నట్లు  ప్రతి సంవత్సరం 1.5 లక్షల కోట్ల డాలర్ల  ఆర్థిక నష్టం జరుగుతున్నట్లు  లాన్ సెట్ పత్రిక  భయంకరమైన చేదు వార్తను అందించింది.  గమ్మత్తైన విషయం ఏమిటంటే ఏటా 69 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు  కేవలం ప్రపంచంలోని 20 సంపన్న దేశాల నుంచే వెలువడు తున్నట్లు  ఒక్క అమెరికా దేశమే  తలసరి ఏటా 130 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను వెలు వరిస్తున్నట్లు  గణాంకాలు తెలియజేస్తుంటే విషపరిణామాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.  కానీ ఇప్పటికీ కూడా భారతదేశం  విషయం  లో తలసరి ఏటా 0.12 కిలోలు మాత్రమే . అయినప్పటికీ ఇది అంతర్జాతీయ సమస్య కనుక  ధనిక దేశాల ప్రభావం మనలాంటి దేశాల పైన పడటం వలన  మనం ప్లాస్టిక్ ను అతిగా వినియోగించకపోయినా కూడా పరిణామాలు చోటు చేసుకోవడం బాధాకరం  .ఒక అంచనా ప్రకారం గా ప్రపంచవ్యాప్తంగా 60 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో పూడ్చి  పెట్టడం  కొంత శాతం వ్యర్థాలను తగలబెడుతున్నప్పటికీ  ఈ రెండు రకాల పద్ధతుల్లో కూడా  పర్యావరణం నాశనం అవుతున్నది. అంతేకాకుండా ఏటా 80 లక్షల టన్నుల ప్లాస్టిక్ సముద్రాల్లోకి చేరడంతో  సముద్ర జలాలతో పాటు జీవరాశి కూడా  ప్రమాద బారిన పడుతున్నది.  ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే 204o వరకు  సముద్రంలో  చేరే వ్యర్థాల  పరిమాణం 320 లక్షల టన్నులకు చేరుకుంటుందని  ప్లాస్టిక్ ఉత్పత్తి కర్బన్ ఉధ్గారాలకు దారి తీయడంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల కూడా భూతాపం పెరుగుతున్నట్లు బొగ్గు కంటే కూడా ప్లాస్టిక్ తోనే కర్బన్ ఉద్గారాలు ఎక్కువ అవుతున్నట్లు విశ్లేషకులు  తెలియజేస్తున్నందున  ప్రపంచం  మేల్కోవలసిన  అవసరం ఎప్పుడో దాటింది.  

ప్రపంచవ్యాప్తంగా ఏటా 40 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు మొత్తం ఉత్పన్నమవుతుంటే  ఈ సంఖ్య 2040నాటికి నాలుగింతలు పెరగనున్నట్లు  తెలుస్తుంది.  ఇటీవల  ఆగస్టు 2025లో 184 సభ్య దేశాలు 400 అంతర్జాతీయ సంస్థలకు చెందినటువంటి ప్రతినిధులు జెనీవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో సమావేశంలో చర్చించినప్పటికీ  11 రోజుల చర్చల తర్వాత కూడా ఎలాంటి ఒప్పందం కుదరకుండానే  సమావేశం ముగిసిపోవడం బాధాకరం . ప్రధానంగా ప్లాస్టిక్లు, పాదరసం వంటి హానికర రసాయనాలను నియంత్రించాలని జెనీవా సభలో స్విట్జర్లాండ్ మెక్సికో దేశాలు  ఒక ప్రతిపాదన చేస్తే  సుమారు 100 దేశాలు ఆమోదించాయి కానీ చమురు ఉత్పత్తి దేశాలు మాత్రం వ్యతిరేకించాయి. కారణం  అత్యధిక స్థాయిలో ప్లాస్టిక్లు పెట్రోలు నుంచే తయారవుతాయి కనుక  ఎలాంటి ఒప్పందం కుదర కుండానే సమావేశం ముగిసినట్టు తెలుస్తున్నది .

అన్ని దేశాలు కఠిన చర్యలు తీసుకోవాలి

ప్రతి దేశంలోనూ ప్రజలు  ప్లాస్టిక్ నియంత్రణకు పూ నుకోవడంతోపాటు ప్రత్యామ్నాయ వనరులను ఆలోచించాలి. అదే స్థాయిలో  ధనిక దేశాలు పేద దేశాలకు ప్లాస్టిక్ చెత్తను  తరలించడాన్ని  వ్యతిరేకించాలి.  ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనకు  అధునాతన టెక్నాలజీని అన్ని దేశాలకు  బాధ్యతాయుతంగా ఐక్యరాజ్యసమితి అందించడం ద్వారా  సభ్య దేశాల సహకారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ఉమ్మడి  గా సభ్య దేశాలు అంగీకరించని పరిస్థితులలో  ఆ దేశాల పైన కఠిన ఆంక్షలు విధించే ప్రయత్నం చేయడం  వంటి చర్యలకు శ్రీకారం చుట్టాలి.  అంగీకరించని దేశాలకు ఎగుమతి దిగుమతులలో కొన్ని ఆంక్షలు విధించడం ద్వారా  తగిన శిక్ష వేయాల్సిన అవసరం కూడా ఉన్నది . ప్రధానంగా ప్లాస్టిక్ వ్యర్థాలు  వాతావరణంలో నీటి ద్వారా  ఇతర జీవరాశి నుండి కూడా మనుషుల పైన  పెను ప్రభావం చూపుతున్న కారణంగా క్యాన్సర్లు, అల్జీమర్స్,  ఇతర వ్యాధులను కలిగించడానికి సంబంధించి హానికారక రసాయనాలు  కీలకమని భావించాలి.  

ఏ రూపంలో అయినా ప్లాస్టిక్ వ్యర్థాలు శరీరంలోకి వెళ్తే  గుండె జబ్బులు, పక్షవాతాలు,  ఇతర భయంకరమైనటువంటి వ్యాధుల బారిన పడుతున్నట్లు  ఏటా ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలుస్తున్నది.  ఇన్ని దుష్పరిణామాలు జరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్తా లపైన  పోరాటంలో సమగ్రమైన ఒప్పందాలలో మాత్రం సభ్య దేశాలు  రాజీ పడకపోవడం,వ్యక్తిగత ఆధిపత్యానికి పాకులాడుతుండడం వలన  కట్టడిలో వైఫల్యం  ప్రపంచాన్ని కలవరపరుస్తున్నది అనేది నిర్వివాదాంశం. ఇది ఒక్క దేశానికి సంబంధించిన విషయం కాదు కనుక ఉమ్మడిగా ప్రపంచ దేశాల మధ్యన  ఒప్పందాలు  కుదరడం ద్వారా వ్యక్తిగతమైన  చర్యలు  ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా వీలైన మేరకు  ప్లాస్టిక్ వ్యర్థాలను, చెత్తను తగ్గించగలిగితే  కొంతవరకైనా ఆరోగ్యాన్ని   కాపాడుకునే అవకాశం ఉంటుంది.  అభివృద్ధి పేరుతో  జరుగుతున్నటువంటి ఈ ఆధునిక మోసాన్ని  అరికట్టడంలో అందరూ పాత్ర పోషించాల్సిందే.


,    (వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ  ,)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333