గానం మాత్రమే అమృతం కాదు భావం కూడా ముఖ్యం
గానం మాత్రమే అమృతం కాదు భావం కూడా ముఖ్యం.* పదునైన పాట సమాజాన్ని ప్రభావితం చేయాలి అంటే గాయకులకు గాత్రం మాత్రమే సరిపోదు.* సామాజిక చింతనతో కూడిన పాట అంతరార్థం, ప్రభావితం చేసే ధోరణి కీలకమైనవి.*
***************************************
----వడ్డేపల్లి మల్లేశం 90142 06412
----02....03....2025*******************
ప్రతి రంగానికి తాత్కాలిక లక్ష్యం విస్తృత లక్ష్యం ఉన్నట్లే పాటలకు కూడా ఉంటాయి అని గాయకులు రచయితలు అభిమానులు అనుకున్నప్పుడు మాత్రమే ఆ పాటలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రజలను ఆలోచింపజేసి అరుధై న జీవితానికి, మానవీయ సమాజ నిర్మాణానికి, కర్తవ్య నిర్వహణకు, వైఖరులు ధోరనులను అవలంబించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంటే పాటలోని సాహిత్యం అంత గొప్పది అనడంలో సందేహం లేదు." పాట సమాజాన్ని ప్రభావితం చేసే పదునైన ఆయుధం అయితే పాటలో ఉండాల్సినటువంటి వస్తువు బలమైనది కాకపోయినా, సమాజానికి తెలిసిన పదాలు వాడకపోయినా, రచనలో స్పష్టత లేకపోయినా, అంతిమంగా ఒక సందేశాన్ని ఇవ్వలేకపోయినా ఆ పాటకు అర్థం లేనట్లే. పాట అంటే ఇంత క్లిష్టమైనది అయినప్పుడు కేవలం పాటలను త నివితీరా పాడి గానామృతాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నామని అనుకునే గాయకులకు ఈ కొత్త విషయం మింగుడు పడనిది కూడా. అయితే వాస్తవాలను చెప్పుకోవడానికి వెనకాడవలసిన అవసరం లేదు". పాట పదునై నది అయినప్పుడు ఆలోచింపచేసి, ఆచరణకు పురి కొల్పి, సంస్కరణకు అవకాశం ఇచ్చి, సమాజాన్ని మార్చే క్రమంలో ఎంతో తోడ్పడుతుంది.అందుకే అనేక ప్రజా ఉద్యమాలు, రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమాలు, స్వతంత్ర పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటంతో పాటు ఇటీవల తెలంగాణ సాధన ఉద్యమాలలో పాట పోషించిన పాత్ర ఎ నలేనిది. ఈ సందర్భంగా పాటలను రచించి సమాజానికి అందించి గాయకులకు అవకాశమిచ్చిన ఆ రచయితలకు వేన వేల వందనాలు తెలపడం మన కనీస ధర్మం .
ఇప్పటికే చాలామంది గాయకులు ముఖ్యంగా సినీ పాటలు పాడే వాళ్ళు ఆనాటి గాయకులు అవలంబించిన విధానాన్ని తాళ లయ జ్ఞానాన్ని సాధ్యమైనంత వరకు అవలంబించి ఉత్తేజము కలిగించే రీతిలో పాట పాడుతున్నారు అనడంలో సందేహం లేదు. కానీ పాటలు పాడడం వినడం వరకే అయితే పాట యొక్క ప్రాధాన్యత ప్రయోజనం చేకూరదు కదా! ఈ అంశం పట్ల ముఖ్యంగా గాయకులకు స్పష్టమైన అవగాహన కలిగి ఉండవలసిన అవసరం ఉంది. పాడుతా తీయగా లాంటి అనేక టీవీలలో ప్రసారం అయ్యే కార్యక్రమాలలో కూడా ఒరిజినల్ పాటలను ఏరకంగా పాడగలిగినారు అని మాత్రమే జడ్జెస్ పరిశీలిస్తున్నారు కానీ అందులోని భావాన్ని, అర్థాన్ని, జ్ఞానాన్ని, సామాజిక ప్రయోజనాన్ని కనీసం ఎక్కడా కూడా ప్రస్తావించకపోవడం వల్ల ఓన గూరే ప్రయోజనం అంతగా ఉండదు.
పాట పుట్టుక ప్రయోజనం తెలిసి ఉంటే మంచిది:*
************************************** సంగీతభరితమైన, సినిమాలకు సంబంధించి, లేదా లలిత గేయాలు ఆయా సందర్భాలకు అనుకూలంగా రాయబడినటువంటి పాటలు. ఇందులో వర్ణన ప్రేరేపన ఆనందము రసాయనభూతి మాత్రమే ప్రధానంగా మన కన్పి స్తాయి. సినిమా పాటల్లో కొన్నింటిలో జీవితము, మానవ సంబంధాలు, కష్టసుఖాలు, ఆరాటము, ఆవేదన, ఆందోళనలు మనకు కనపడతాయి కానీ ఇవి మాత్రమే ఒక సంపూర్ణమైన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి చాలవు. కనుక సామాజిక చైతన్య విప్లవ సంఘసంస్కరణకు సంబంధించినటువంటి ఉద్యమ ప్రజా గేయాలను మనం ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. ఈ క్రమంలోనే పాట పుట్టుక లేదా పాట యొక్క ప్రయోజనాన్ని కూడా అర్థం చేసుకోవడం చాలా అవసరం. " ప్రజల బాణీలో, ప్రజల సమస్యల పైన, ప్రజల కష్టసుఖాల నుండి, ప్రజల చమట సంస్కృతి నుండి పుట్టింది అని జాతీయ అవార్డు గ్రహీత సినీ గే రచయిత సుద్దాల అశోక్ తేజ గారు మనిషి చమట నుండి శ్రమ నుండి పాట పుట్టిందని చెప్పడం ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక ప్రముఖ తత్వవేత్త మేధావి దార్షనికులు బిఎస్ రాములు గారు పాట పుట్టుక గురించి ఒక సుదీర్ఘమైనటువంటి కావ్యాన్ని రాయడం అరుదైన విషయం ఈ అంశాల పైన మనం ఆశాంతం అధ్యయనం చేయడం ద్వారా రచయితలు గాయకులు కవులు కళాకారులు పాటల మీద దృష్టి సారించవలసిన అవసరం పాటల పైన సంపూర్ణ అవగాహన పెంచుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉన్నదని గుర్తిస్తే మంచిది .టీవీ ప్రసారాలలో కూడా పాట పాడడంతో సంబంధం లేని వ్యక్తులు గాయకుల యొక్క పాటలను జడ్జిమెంట్ చేస్తున్న విషయాన్ని ప్రస్తావించినప్పుడు అది ఏ రకంగా సమంజసమో మనం అర్థం చేసుకోవాలి. సామాజిక చింతన కలిగి సమాజం మీద సంపూర్ణ అవగాహన కలిగినటువంటి రచయిత జడ్జిమెంట్ లో భాగస్వామి అయితే పెద్దగా అభ్యంతరం లేదు కానీ సమాజంతో సంబంధం లేకుండా, కేవలం సినీ సాహిత్యం మీదనే దృష్టి సారించి, సంపాదన కోసo మాత్రమె ఆరాటపడే వ్యక్తులు జడ్జిమెంట్కు ఎలా అర్హులవుతారు? ఒకసారి ఆలోచించుకోవాలి. అలాగే గాయకులయినంత మాత్రాన పాట యొక్క పుట్టుక, ప్రాధాన్యత, అందులోని సారాంశము, విశ్లేషణ, సామాజిక స్ఫూర్తి పైన అవగాహన లేనటువంటి వాళ్లు కూడా నిజమైనటువంటి న్యాయాన్ని అందించలేరు. ఘంటసాల తో పాటు ఇతర గాయకుల యొక్క జయంతి వర్ధంతి సందర్భాలలోనూ, లేదా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోసం చేసే కార్యక్రమాలు, ఇతర గాన లహరి పేరుతో ఏర్పాటు చేస్తున్న అనేక కార్యక్రమాల సందర్భంలో కూడా కేవలం సినిమా పాటలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం అక్కడ ఘంటసాల సుశీల లేదా సుబ్రహ్మణ్యం ఇతర ఒరిజినల్ గాయకులు పాడిన పద్ధతిలో పాడుతున్నామా లేదా అని మాత్రమే పోల్చుకోవడం తోనే సరిపెట్టుకుంటున్నారు. కానీ అందులోని భావాన్ని ప్రేక్షకులకు సమాజానికి విడమర్చి చెప్పే అటువంటి అవకాశం లేకపోవడం వలన కేవలం రసానుభూతి మాత్రమే ఇచ్చేది పాట అనే భావన సరైనది కాదు. "రసాను బూతి తోపాటు సామాజిక విశ్లేషణ చైతన్యం అవగాహన సంఘసంస్కరణ సామాజిక బాధ్యతను గుర్తింప చేసేదే నిజమైన పాట అని, ప్రతి పాటకు ఆ రకమైన ప్రయోజనం ఎంతో కొంత ఉండాలని రచయితలు కవులు కళాకారులు గాయకులు గుర్తించడం చాలా అవసరం. సామాజిక ప్రయోజనం లేని పాటలు, గానం తుప్పు పట్టిన కత్తిలాంటిది అని తెలుసుకుంటే మంచిది." సాహిత్యం ఏ రకంగా నైతే సమాజాన్ని మార్చడానికి సమాజానికి హితం చేకూర్చడానికి ప్రయత్నం చేస్తున్నదో ఆ కోవలోనే సాహిత్యకారులకు మద్దతుగా గాయకులు కూడా సమాజం పైన పూర్తి అవగాహన విశ్లేషణ కలిగి ఉండడంతో పాటు తాము పాడే పాటల ద్వారా కొంతవరకైనా జనంలో చైతన్యం తీసుకురావడానికి కృషి చేయగలిగినప్పుడు మాత్రమే పాటల పోటీలు, కళాకారుల యొక్క గాన కచేరీలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలకు సార్థకత ఉంటుందని తెలుసుకుంటే మంచిది. మొక్కుబడి గానంతో ప్రయోజనం శూన్యం ఈ మాట గాయకులను బాధపెట్టినప్పటికీ నిజం నిప్పులాంటిది సుమా!
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )