వైభవంగా ప్రారంభమైన టీపీటీఎఫ్ జిల్లా స్థాయి ఉపాధ్యాయ క్రీడా పోటీలు

ఏటూరునాగారం గ్రామ సర్పంచ్ కాకుల మర్రి శ్రీలత

Aug 30, 2026 - 19:07
Aug 30, 2026 - 19:08
 0  5
వైభవంగా ప్రారంభమైన టీపీటీఎఫ్ జిల్లా స్థాయి ఉపాధ్యాయ క్రీడా పోటీలు

సెప్టెంబర్ 05 న రానున్న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీపీటీఫ్ ) ములుగు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఉపాధ్యాయ క్రీడా పోటీలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఏటూరునాగారం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కాకులమర్రి శ్రీలత ముఖ్య అతిథిగా హాజరై క్రీడా పోటీలను అధికారికంగా ప్రారంభించారు.సర్పంచ్ కాకులమర్రి శ్రీలత మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దిద్ది తీర్చే ఉపాధ్యాయులు తమ దైనందిన వృత్తిపరమైన ఒత్తిడులను అధిగమించడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఉపాధ్యాయులలో శారీరక దృఢత్వాన్ని మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు టీపీటీఎఫ్ సంఘం ఇలాంటి జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. క్రీడలు సోదరభావాన్ని సమైక్యతా భావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు సంజోష్ స్థానిక ఎస్సై మహేష్ ములుగు జిల్లా ఆత్మ చైర్మన్ చిటమట రఘు ఉప సర్పంచ్ పర్వతాల ఎల్లయ్య, టీపీటీఫ్ సంఘ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ములుగు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333