వెల్దేవి గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా లైట్లు ఏర్పాటు

Aug 15, 2025 - 19:18
Aug 15, 2025 - 19:48
 0  75

అడ్డగూడూరు14 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామంలో శ్రావణమాసం ముత్యాలమ్మతల్లి బోనాల సందర్భంగా గ్రామ ప్రభుత్వ పాఠశాల నుండి ముత్యాలమ్మ తల్లి గుడి వరకు అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాచకొండ రమేష్ గౌడ్,గుడి కమిటీ అధ్యక్షులు చిలుకూరి(పెద్ద)సోమయ్య గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు రచకొండ సతీష్ గౌడ్ 8వెల రూపాయల ఖర్చుతో రాత్రివేళ పురుగు,బూసి,రైతులు, కూలీలు బాటసారిలు, ప్రమాదాలకు గురి కాకుండా పొలాల క్షేత్రం నుండి నడిచే ప్రజల కోసం లైట్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కోటమర్తి రాములు,చిలుకూరి శ్రీనివాస్ గౌడ్,ఊట్కూరి సంజీవరెడ్డి,రేకల బిక్షమయ్య అడ్డగూడూరు మండల యూత్ కాంగ్రెస్ నాయకులు చిలుకూరు వంశి గౌడ్,నిమ్మల రాకేష్,గ్రామ ప్రజలు, మహిళలు బోనాల పండుగ సందర్భంగా లైట్లు వేయడాన్ని హర్షిం వ్యక్తం చేశారు. గ్రామ మహిళలు చిన్నారులు నూతన పట్టు వస్త్రాలు ధరించి బోనoమెత్తారు. ఏపరిల్లలు చేతపట్టి షిగాలతో సింధు లేస్తూ.. ఆటపాటల నడుమ డప్పు వాయిద్యాల దరువుతో.. బోనమెత్తిన మహిళ మూర్తులు.. కుంకుమ బండారి బోనం మోక్కులు ఆ ముత్యాలమ్మ తల్లికి సమర్పించారు.ఆ తల్లి నుండి ఆశీర్వాదం స్వీకరించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు,పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333