వీల్ చైర్ కే పరిమితమైన  సామాజిక బాధ్యత గల మేధావి  విశ్వాన్ని ప్రభావితం చేయగలిగితే

Nov 1, 2024 - 18:43
Nov 11, 2024 - 20:58
 0  1
వీల్ చైర్ కే పరిమితమైన  సామాజిక బాధ్యత గల మేధావి  విశ్వాన్ని ప్రభావితం చేయగలిగితే

రచయితలు ఉద్యమకారులమని చెప్పుకునే మనం  కూాట్లో రాయిని తీయలేకపోతున్నాం ఎందుకు?

 లోపం ఎక్కడుంది  ? ఆలోచన, కార్యాచరణ,  చిత్తశుద్ధి  ఎందులోపల  ?

---వడ్డేపల్లి మల్లేశం 

గడప దాటని మాటలతో  ప్రయోజనం లేదు  కావాల్సింది మాటలు  కాదు  పని అని మన పెద్దలు చెబుతూ ఉంటారు  .అవును కార్యాచరణే ముఖ్యం కానీ  అధిక ప్రసంగాలు కాదు అయినా  ప్రణాళికాబ ద్ధమైన ఆలోచన, అందుకు తగిన  చర్చలు,  బలగాలు, ఆచరణను సమీకరించుకోవడం,  లక్ష సాధనలో ముందుకెళ్లే క్రమంలో కలిసివచ్చే వాళ్లతో  జత కట్టడం కూడా  ఉద్యమానికి  ప్రజా బహుల్యo  తో సంబంధం ఉన్న ప్రతి పనికి చాలా అవసరం . కొందరు అక్షరాస్యతకు దూరమైనా, అవిటి వాళ్ళయినా, ఆర్థికంగా లేకపోయినా  అనూహ్యమైన విజయాలను సొంతం చేసుకున్న సందర్భాలను మనం గమనించవచ్చు . మరికొందరికి ఆలోచన ఉంటుంది,   ఆర్థిక పరిస్థితి చేదోడువాదోడు కొంత మెరుగు న్నప్పటికీ  ముందుకు పోయిన సందర్భం మనకు అంతగా కనిపించదు . ఈ రకమైన తేడాను గమనించినప్పుడు  అనేక ప్రశ్నలు మనం వేసుకోవలసి ఉంటుంది  మనమెందుకు చేయలేకపోతున్నాం?  మన ప్రతి అడుగులో  చేస్తున్న పొరపాటు ఏమిటి?  ఆటంకాలు అధిగమించలేకపోతున్నామా?  మన శక్తి సరిపోవటం లేదా?  అంతకుమించి మన ఆలోచనలో  ప్రణాళికలో లోపం ఉందా?  అని సమీక్షించుకోవడం ప్రతి పనికి కూడా చాలా అవసరం.  ప్రజలతో మమేకమై  కలిసిపోయే సామాజిక కార్యక్రమాలకు   శాస్త్రీయమైన అవగాహన, హేతుబద్ధమైన ఆలోచన,  గత అనుభవాల నుండి  పాఠాలను స్వీకరించడం  ద్వారా  మన లక్ష్యాన్ని ఆలోచనను పరి పుష్టి చేసుకోవలసి ఉంటుంది . చేతులు లేని వాళ్ళు ఎందరో కాలితో పరీక్షలు రాసి  మిగతా సమాజంతో పోటీపడిన సందర్భాలు,  కాళ్లు లేని వాళ్ళు  ఆలోచన బలంగా ఉంటే  అద్భుతమైన  ఫలితాలను సృష్టించిన వాళ్ళు అనేకం.  వాళ్లతో పోల్చుకున్నప్పుడు అన్నీ ఉండి మనం  ఎందుకు అన్ని రంగాలలో వెనుకబడి పోతున్నాo  అని  ప్రశ్నించుకోకపోతే ఎలా?  చిన్ననాడే కాళ్లు చేతులు  పోలియోతో చచ్చుబడిపోయినా  అలుపెరుగని శ్రద్ధ, పోరాటం,  తపనతో  ఉన్నత విద్యను పూర్తిచేసుకుని  ప్రజల కష్టాలలో భాగమై  వీల్ చేర్కే పరిమితమైన  సామాజిక బాధ్యతను భుజానికి ఎత్తుకున్నందుకు  సాయిబాబా సారు  ప్రపంచాన్ని జయించినాడు.  అక్రమ కేసులు బనాయించి,  చైతన్యాన్ని  లొంగ తీసుకోవాలని చేసిన రాజ్యం కుట్ర  అంతర్జాతీయ సమాజం ముందు ఓడిపోయింది.  భారత సర్వోన్నత న్యాయస్థానం పలు సందర్భాలలో  రాజ్యాంగంలోని రక్షణలను  ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని  చేసిన సూచన  చట్టాలను తయారు చేసిన  వాళ్లే పాటించకపోవడంతో  న్యాయపోరాటంలో ఓడిపోయినా  చట్టానికి, న్యాయవ్యవస్థకు  సవాలు విసిరిన తీరు ప్రపంచమే  నీ వ్వేర పోయే స్థాయిలో ఉండడం  మనలాంటి మార్పు కోరు కార్యకర్తలకు  ప్రేరణగా పనిచేయాలి.
      మనలో మనం ప్రశ్నించుకుందాం :-
**********
అక్రమంగా అరెస్టు చేసి  2014 మేలో  నిర్బంధించిన తర్వాత  2017  లో యావత్ జీవ శిక్ష పడడం  ఆ తర్వాత  మహారాష్ట్ర హైకోర్టు  నిర్దోషి అని  2022లో తీర్పు ఇచ్చినా అక్కడి ప్రభుత్వం అడ్డుకోవడంతో తిరిగి సర్వోన్నత న్యాయస్థానం  పునర్విచారణ చేయమని ఆదేశించగా  విచారణ అనంతరం 2024 మార్చి 5వ తేదీన  నిర్దోషి అని విడుదల చేయడం  ఒకవైపు జరిగితే,  3558 రోజుల పాటు  ఏ నేరం కింద అండా సెల్లో శిక్ష అనుభవించినాడో చట్టం ,న్యాయం , పార్లమెంటు సమాధానం చెప్పాల్సిన అవసరం  ఉంది.  సాయిబాబా సార్ నే రస్తులు కానప్పుడు మరి నేరం  ఎవరు చేశారు?  అసలైన శిక్ష ఎవరికి వేయాలి? అనేది ఇప్పుడు  భారత సమాజం తేల్చవలసిన  వినూత్నమైన ఒక సందర్భం . ఇది భవిష్యత్తులో  పాలకులు వేసే తప్పటడుగులకు  కటోర శిక్షగా పరిణమించాల్సిన అవసరం ఉన్నది. 
       రైతులు, కార్మికులు, ఆదివాసీలు, సా  సామాన్య ప్రజలు, చేతివృత్తుల వాళ్ళు,  తాడిత పీడిత ప్రజానీకం కోసం  ఒకవైపు ఉద్యోగం చేస్తూనే తన ఆలోచనను  అందించి ఆలంబనగా నిలిచిన  90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబా   సారు ఆదర్శాల ముందు  మనము ఈ దేశం బాగుండాలని  సా మాజిక మార్పు  మన వంతు బాధ్యతగా మెరుగైన సమాజం కోసం  ఆరాటపడుతున్నప్పటికీ కవులు రచయితలు కళాకారులు మేధావులుగా  మన కృషి  లో ఏదో  వెలితి ఉన్నట్లుగా కనిపిస్తున్నది . .సాయిబాబా సార్ ను అక్రమంగా నిర్బంధిస్తే ఐక్యరాజ్యసమితి తో పాటు అంతర్జాతీయ సమాజం కూడా భారత ప్రభుత్వానికి  విడుదల చేయాలని కోరడం అంటే  తన పోరాట పటిమను ప్రపంచానికి చాటి చెప్పడమే కదా!  ఈ దేశంలో  ప్రజా ఉద్యమంలో పనిచేస్తున్న  వారు,  పూర్తి కాలం సేవా దృక్పథంతో కార్యాచరణలో  కలిసిపోయినవారు  కొందరు ఆలోచన ఇస్తే మరి కొందరు కార్యాచరణతో  కలిసిపోతున్న కార్యకర్తలకు లోటు ఏమి లేదు. అయినా  ప్రజా ఉద్యమాలు నీరుగారిపోవడం,  సానుకూల పరిస్థితులు లేకపోవడం,  పాలకుల యొక్క  పోలీసు కోసం చేస్తున్న అనేక  నిర్బంధాలు  అన్నింటితో  భిన్న రూపాలలో కొనసాగుతున్నటువంటి ప్రజా పోరాటాలకు  ఇబ్బంది కలుగుతున్నదని మహా మేధావులు  చేస్తున్న వాదనలో ఎంతో వాస్తవ ఉన్నది. అయినప్పటికీ  వీల్ చేరుకే పరిమితమైనా తన ఆలోచనతో ప్రభుత్వాలను గడగడలాడించిన  అసమానదీరుడు  సాయిబాబా సార్  ద్వారా ప్రేరణ లభించకపోతే ఎలా?  అది కూడా ప్రజాక్షేత్రంలో సామాన్య  ప్రజల కోసం  మనుషులుగా మన చేదోడును అందించడమే కదా ! అయితే నేరం చేయకపోయినా  కేసులు బనాయించి  శిక్షిస్తున్న ఈ దేశ న్యాయ  వ్యవస్థకు  ప్రస్తుతం అనేక సవాళ్లు  ముందున్న తరుణంలో   సిద్ధాంతము, ఆలోచన,  ఆచరణ నుండి పక్కదారి పట్టకుండా ఇప్పటికీ లక్షలాదిమంది కార్యకర్తలు  తమ జీవితాలను ప్రక్కన పెట్టి  ఉద్యమానికి అంకితమైన వాళ్ళు ఉన్నారు. కానీ  ఎందుకో లక్ష్యాన్ని చేరుకోలేక  పోవడం ప్రతి కార్యకర్తకు  ఆందోళన గానే ఉన్నది. అయినప్పటికీ  సాహిత్యాన్ని సమాజ పరిశీలనను అధ్యయనం చేయడం ద్వారా  పాఠకులు మహా పాఠకులను కార్యకర్తలను సమీకరించుకోవడం ద్వారా  అంతి. మంగా మెరుగైన సమాజాన్ని నిర్మించుకోవడానికి  ఎక్కడికక్కడ  పకడ్బందీ  ప్రణాళికలు కొనసాగాలి . పాలకులు  పక్కదారి పట్టినా  ప్రజా పోరాటాలు మాత్రం  ప్రజల కోసమే పని చేయాలి  అది ఒక సామాజిక బాధ్యత . ఆ లక్ష్యం,ఆదర్శాలను   ప్రజా ఉద్యమాలు  భుజానికి ఎత్తుకుంటున్నాయి ఇది ఒక మహోన్నతమైన  సందర్భం . సాయిబాబా సారు అందించినటువంటి  ప్రేరణ, ఆదర్శం ,ఆలోచన  ఎంతోమందికి మార్గాన్ని సుగమం చేసింది అంటే అతిశయోక్తి కాదు.  అయితే ఉద్యమం ఏమీ పూలబాట కాదు,.  అదే సందర్భంలో  మనం చేస్తున్న కృషి  త్యాగాలు  సామాన్య ప్రజానీకానికి తాడిత పీడితులకు  తెలియ చెప్పడంలో వెలితి రాకుండా చూసుకోవడం కూడా అవసరమే ఇది మామూలు విషయం కాదు.  భిన్నదారులలో సాగే  ఆలోచన ఉద్యమాలు  ఫలితాన్ని ఇవ్వగలగాలి అంటే  భిన్నత్వంలో ఏకత్వానికి పదును పెట్టుకోవడమే.  భారతదేశంలో ప్రపంచంలోను  వ్యక్తులు గానే అనేకమంది  శక్తివంతులై  పాలకులకు  సమస్యగా మారి  నమ్మిన సిద్ధాంతం కోసం లక్ష్యాన్ని చేరుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు.  వారి చరిత్రలను అధ్యయనం చేద్దాం,  వారి ఆలోచనలను  సమన్వయం చేసుకొని  ముందుకు పోవడమే  ఈ తరుణంలో సాయిబాబా సార్ కు ఇవ్వగలిగిన ఘనమైన నివాళి.  నిరాశ  స్పృహలకు తావు లేకుండా  పని చేస్తూ పోతుంటే  గమ్యంతో పాటు గమనం కూడా మంచిదైనప్పుడు ఫలితాలు ఉంటాయి అని  ఉద్యమకారులు చేసిన  సూచన  ఫ లవంతమవుతుందని  భావించినప్పుడే సానుకూల వైఖరితో  సాగుతుంది  సామాజిక మార్పుకు సంబంధించిన పోరాటం.
(  వ్యాసకర్త  సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ  సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333