విద్యార్థులు విధ్యతో పాటు పోలీస్, ప్రభుత్వం  అందిస్తున్న సేవలను తెలుసుకోవాలి

జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ 

Oct 22, 2024 - 19:10
Oct 22, 2024 - 21:31
 0  21

జోగులాంబ గద్వాల 22 అక్టోబర్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో బాగంగా  ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ స్టాల్స్  సందర్శినకు వచ్చిన కళాశాల విద్యార్థులతో జిల్లా ఎస్పీ  స్వయంగా ఇంటరాక్ట్ అయ్యారు
విద్యార్థులు విద్యాతో పాటు పోలీస్, ప్రభుత్వ యంత్రాంగం  ప్రజలకు అందిస్తున్నా సేవలను తెలుసుకొని వినియోగించుకోవాలని  జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్  విద్యార్థులకు సూచించారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో బాగంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన షి టీమ్, సైబర్ క్రైమ్, మాదక ద్రవ్యాల నివారణ యూనిట్, భరోసా, ఆయుధ ప్రదర్శన, డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోసల్ టీమ్, ట్రాపిక్ స్టాల్స్ సందర్శనకు వచ్చిన భోధిని జూనియర్ కళాశాల - శాంతి నగర్, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల - మనోపాడ్ విద్యార్థులతో సందర్శన అనంతరం  జిల్లా పోలీస్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో జిల్లా ఎస్పీ  ఇంటరాక్ట్ అయి పలు సూచనలు చేశారు.
ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో సమాజంలో జరుగుతున్న పరిణామాల పై అవగహన పెంచుకోవాలని అన్నారు. గతంలో సైబర్ నేరాలు,మహిళల పై ఈవ్ టీజింగ్ జరిగేవి కాదని కాలానుగుణంగా నేర ప్రవృత్తి మారుతుందని ప్రజలు కూడా వాటి పై అవహగన పెంచుకొని జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలు, విద్యార్థినిలు ముందుకూ రావాల్సిన అవసరం ఉందని వారి కోసం ప్రభుత్వం, పోలీస్ శాఖ అందిస్తున్నా షి టీమ్, భరోసా, సఖి సెంటర్ సేవలను తెలుసుకొని, అత్యవసర సమయాల్లో డయల్ 100, టీం నం 8712670312 కు కాల్ చేసి పోలీస్ సేవలను  వినియోగించుకోవాలని అన్నారు. 
విద్యార్ధులు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ అంటే ఏమిటి, అది ప్రజలకు శాంతి భద్రతల విషయంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని ఫంక్షన్నింగ్ ఏవిధంగా ఉంటుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అందు కోసం  స్టాల్స్ ను ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు విద్యార్థులకు అవగహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు మాదక ద్రవ్యాల వినియోగం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మీ కుటుంబాలలో/గ్రామాలలో డ్రగ్స్ కు సంబంధించిన సమాచారాన్ని, చట్ట వ్యతిరేకం గా జరిగే కార్యకలాపాల సమాచారాన్ని  విద్యార్థులు తప్పకుండా పోలీస్ వారికి తెలియజేయాలని  కోరారు. సైబర్ నేరాలు కొత్త కొత్త పోకడలతో జరుగుతున్నాయని మీ కుటుంబాలలో ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే 1930 హెల్ప్ నెంబర్ కు 24 గంటలలో సమచారం అoదించాలని అన్నారు. నేటి విద్యార్ధులే రేపటి భావి తరాల పౌరులు కావున  నిత్యం సమాజంలో జరుగుతున్న పరిణామాల ను తెలుసుకోవాలని అందుకు న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలని, అలాగే ప్రభుత్వ యంత్రాంగం,అధికారుల విధులు ఏమీ, ఎస్పి, కలెక్టరు,  మంత్రులు, ముఖ్య మంత్రి అంటే ఏమిటి, వాళ్ల అధికారాలు ఏమిటి అనే అంశాలు తెలుసుకోవాలని ఎస్పి విద్యార్థులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆర్ ఐ వెంకటేష్ , శాంతి నగర్ బోధిని కళాశాల విద్యార్థులు, మానోపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు గజేందర్, రవి తేజ, సురేష్ తదితరులు ఉన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State