కొప్పుసూరులో వైద్య శిబిరం ఏర్పాటు
వాజేడు అక్టోబర్ 22 తెలంగాణ వార్త :- మండల పరిధి మొరుమూరు గ్రామపంచాయతీ కొప్పుసురు గ్రామంలో మత శిశు సంరక్షణ వైద్యాధికారి యోహిత ఆధ్వర్యంలో మంగళవారం వైద్య శిబిరం నిర్వహించారు. ఎన్ సిడి స్క్రీనింగ్ నిర్వహించారు.30 సంవత్సరాలు పైబడిన వారిని గుర్తించి మధుమేహం, రక్తపోటు,నిర్ధారణ పరీక్షలు చేశారు.గ్రామాలలో వీధి కుక్కల బెడద ఎక్కువ ఉన్నందున చిన్నపిల్లలను బయటికి పంపవద్దని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.క్షయ వ్యాధిగ్రస్తులకు తప్పనిసరి మందులు వాడాలని మధుమేహం. రక్తపోటు ఉన్నవారు నెలసరి మందులు వాడాలని ఆశా కార్యకర్త ద్వారా
ఈ వ్యాధిగ్రస్తులకు మందులు వైద్యాధికారి ఆశ కార్యకర్తలకు తెలియజేశారు. జలుబు దగ్గు ఉన్నవారు కాచి వేడి చేసి చల్లార్చిన నీటిని త్రాగాలని,పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మూడు రోజులుగా నిల్వ ఉన్న నీరును పారబోయాలని తెలిపారు. బాలింతలు,గర్భవతులు,
క్షయ వ్యాధిగ్రస్తులు, మధుమేహం.,రక్త పోటు, ఉన్న వారిని
పరీక్షించి మందులు అందజేశారు. వాజేడు ప్రాథమిక వైద్యాధికారి కొమరం మహేందర్ ఆశ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి సర్వే రికార్డులు వైద్య కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో
హెల్త్ సూపర్వైజర్ కోటిరెడ్డి,సత్య నాగవేణి, అనుష, ఛాయదేవి, శేఖర్,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.