నరసింహపురం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

Mar 8, 2026 - 18:53
Mar 9, 2026 - 03:36
 0  4
నరసింహపురం గ్రామ సర్పంచ్  ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

మునగాల 08 మార్చి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :- మునగాల మండలం నరసింహపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా  నిర్వహించారు. ఈ సందర్భంగా స్వయం ఉపాధి పొందే విధంగా మహిళలకు కుట్టు మిషన్ల శిక్షణను ఈరోజు ప్రారంభించారు. కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని. సర్పంచ్ చేతుల మీదుగా ప్రారబించి. తదుపరి. గ్రామానికి చెందిన. మహిళా వార్డ్ సభ్యులు పచ్ఛిపాల అశ్విని రేవూరి కళ్యాణి సామాజిక విశ్లేషకురాలు బంగారు నాగమణి. పారిశుద్ధ్య కార్మికురాలు. కిన్నెర కౌసల్య. కుట్టు శిక్షణ నిర్వాహకులు. రేణుక . వాణిలను సర్పంచ్ ఆధ్వర్యంలో. ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ. మహిళా సాధికారత సాధించాలంటే. ప్రతి మహిళా స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని. అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని. ముఖ్యంగా. మహిళా ఆరోగ్య భద్రత. వారి సంక్షేమం కోసం. ఇప్పటికే. వివిధ రకాల ఉచిత మెగా వైద్యశిబిరాలు. ఏర్పాటు చేసి ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని. అలాగే. ఈ ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమానికి. 60 మంది మహిళలు పేర్లు నమోదు చేసుకున్నారు అని. ఈ కార్యక్రమం. మూడు నెలల పాటు కొనసాగుతుందని. ప్రతి. మహిళా. ఈ శిక్షణ కార్యక్రమాన్ని. సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కుట్టు శిక్షణ కార్యక్రమం. సూర్యాపేట లయన్స్ క్లబ్ వారి సహకారంతో జరుగుతుంది అని అన్నారు ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సామాజిక విశ్లేషకులు, సేవకురాలు బంగారు నాగమణి పాల్గొని ఆమె మాట్లాడుతూ... కష్టం వస్తే ముందు నిలబడేది స్త్రీ అని, బాధ వస్తే భరించేది స్త్రీ అని నిరంతరం ఎప్పుడు శ్రమిస్తూ కొంచెం కూడా ఖాళీగా ఉండని మహోన్నతమైన వ్యక్తి స్త్రీ అని ఆమె అన్నారు. మగవారితో పాటుగా ఆడవారి శ్రమకు తగిన గుర్తింపు లభించినప్పుడే సమాజం అభివృద్ధి పథంలో ముందుకెళుతుందని, స్త్రీల యొక్క సహాయం, శ్రమ లేకుండా సమాజం కానీ, కుటుంబం కానీ ముందుకెళ్లలేదని... ఎప్పుడూ స్త్రీ ఇంటా కానీ, బయట కానీ ఖాళీగా ఉండకుండా ఒళ్లంతా చేతులు చేసుకొని పనిచేసే కాళీకామాత అని ఆమె అన్నారు. కేవలం మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను పొగిడితే సరిపోదని ఆమె అన్నారు. మరో వక్త పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం "కీర్తి పురస్కార గ్రహీత", తెలుగు లెక్చరర్ వేముల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ...ఈ మహిళా దినోత్సవాన్ని ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించి ఆడవారి శ్రమను, వారి స్వాతంత్ర్యాన్ని, ఆత్మ అభిమానాన్ని, సమానత్వపు భావాలను 

అందరూ గౌరవిస్తూ... సమీక్షించుకోవాలని, స్త్రీ కుటుంబ వ్యవస్థకు మూల స్తంభం లాంటిదని, దేశ సంస్కృతిని, సమాజ సాంప్రదాయాలను కాపాడుతూ గౌరవం తీసుకొచ్చేదని అన్నారు. తెర వెనుక ఉన్న పితృస్వామ్య వ్యవస్థ అంతమై, స్త్రీ పురుషులు ఇరువురు సమానమే అన్న ఆలోచన అందరిలో కలగాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కెమిస్ట్రీ లెక్చరర్ తోట కిరణ్. కేసగాని వెంకన్న. వినోద్. శ్రీను. మనోజ్. నారయ్య వీరాస్వామి. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State