వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలనే జీవో 34ను అమలు చేయాలి

Nov 8, 2025 - 18:24
Nov 8, 2025 - 18:27
 0  13
వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలనే జీవో 34ను అమలు చేయాలి

3 ఏండ్లు గడిచిన అమలుకు నోచుకోని జీవో

నవంబర్ 10న కలెక్టర్ కార్యాలయల ముందు ధర్నాని జయప్రదం చేయండి

 ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్
రామన్నపేట 08 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలనే జీవో 34ను  అమలు చేయాలని నవంబర్ 10న జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయల ముందు ధర్నాని జయప్రదం చేయాలని  వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రామన్నపేట మండలం సెంటర్లో సుభాష్ బొమ్మ దగ్గర వాల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది.ఈ  కార్యక్రమాన్ని హాజరై జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం 34 ద్వారా మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు వికలాంగుల సంక్షేమ శాఖ మధ్య జిల్లాలో అందుబాటులో ఉన్న ఉద్యోగులను సర్దుబాటు చేసి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని 2022 డిసెంబర్ 2వ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వం జీవో ఇచ్చి 3 సంవత్సరాలు అవుతున్న అమలు కావడం లేదు.వికలాంగుల సంక్షేమం కోసం నిర్వహణ కోసం అసిస్టెంట్ డైరెక్టర్ ను జిల్లా స్థాయిలో తిరిగి నియమించాలని ప్రభుత్వం జీవో విడుదల చేసింది.గతంలో వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా,శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసిన వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని గతంలో విడుదల చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసింది.జిల్లా స్థాయిలో వికలాంగులకు సమర్థవంతమైన సేవలు అందించడానికి మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి వికలాంగుల సంక్షేమ శాఖను విభజించాలని గత ప్రభుత్వం నిర్ణయం చేసింది.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 23 నెలలు అవుతున్న జీవో నెం 34 అమలు కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.రాష్ట్ర ప్రభుత్వం వేలాది ఉద్యోగాలను కొత్తగా నియమించడం జరిగింది. వారిలో నుండి వికలాంగుల సంక్షేమ శాఖను అవసరమైన ఉద్యోగులను నియమించడానికి అవకాశం ఉన్న ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు.వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని గత ప్రభుత్వం హయాంలో అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. పోరాటాలకు తలోగ్గి తెరాస ప్రభుత్వం జీవో విడుదల చేసింది. విడుదల అయిన జీవోను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తుంది.రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జీవో నెం 34ను అమలు చేయాలని నవంబర్ 10 నాడు భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాని జయప్రదం  చేయాలని పిలుపునివ్వడం జరిగింది.


   ఈ కార్యక్రమంలో ఎన్,పి ఆర్,డి మండల అధ్యక్షులు బలుగూరి అంజయ్య మండల కార్యదర్శి గిరికల లింగస్వామి మండల ఉపాధ్యక్షులు నాగు నరసింహ మండల సహాయ కార్యదర్శి పున్న  శ్రీధర్ సుంకి వెంకటేశం, వరుకుప్పల యాదయ్య, నరసింహ,శ్రీరామ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333