మిర్యాలగూడ BRS పార్టీ కార్యాలయములో శ్రీ సంత్ సేవాలాల్ 286 వ జయంతి ఉత్సవాలు..

మిర్యాలగూడ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
తెలంగాణ వార్త మిర్యాలగూడ ఫిబ్రవరి 15: ఈ రోజు మిర్యాలగూడ టౌన్ బీ ఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గల్ ఆధ్వర్యములో ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286 వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు నియోజకవర్గ గిరిజన నేతలతో కలిసి మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలు మాల వేసి నివాళులు అర్పించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడుతూ బంజారా జాతి సంస్కృతి, హక్కులు, అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ అని, ఆయన చూపిన మార్గం, బోధనలు మనకు నూతన స్ఫూర్తిని అందించాలని , సమాజ అభివృద్ధికి, విద్య, ఆర్థిక స్వావలంబన కోసం నిరంతరం కృషి చేయాలని ఆయన ఆశయాలు మనకు మార్గదర్శనం చేస్తున్నాయని గుర్తు చేశారు.. అలాగే గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాయములో సబ్బండ వర్గాల అభివృద్ది జరిగిందని, మన నియోజకవర్గము నది బొడ్డులో అత్యంత విలువైన స్థలములో ఒక కోటి రూపాయలతో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్" కమ్యూనిటీ హాల్ నిర్మించానని గుర్తుచేశారుఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక గిరిజనులకు చేసిందేమి లేదని, కేసీఆర్ ఆనాడు మనిఫెస్టో లో పెట్టకున్న, ఎవ్వరూ ఆడగకున్న తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారుగతములో మా తండాలో మా రాజ్యం పేరిట అనేక పోరాటాలు, ఉద్యమాలు మనం చూశామని , కానీ కేసీఆర్ గారు 60 సంవత్సరాల కలను నిజం చేసి తండాలు, గూడెం లను నూతన గ్రామపంచాయితీలుగా ఏర్పాటు చేసి ప్రతి గ్రామ పంచాయతికి నూతన జీపీ బిల్డింగ్ ను నిర్మించారని గుర్తు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు.. అనంతరం ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవానికి గిరిజన నాయకులతో కలిసి హాజరయ్యారు
కార్యక్రములో ధనావత్ చిట్టిబాబు నాయక్,అంగోతు హాతీరాం నాయక్, కుర్ర సేవ్య నాయక్, బాణవత్ లలిత,శంకర్ నాయక్,లావూరి శ్రీను, రమావత్ వినోద్ నాయక్,రాందాస్ నాయక్, సాక్రం నాయక్, కుర్ర శ్రీను, సైదా నాయక్, ఎండి. షోయబ్,చంటి నాయక్, ఆజ్మీర లింగా నాయక్, రఫీ, కిషన్ నాయక్, లచ్చు నాయక్, శ్రీను నాయక్,ఫయాజ్ తదితరులు ఉన్నారు.