వికలాంగుల పెన్షన్ పెంపు, బడ్జెట్లొ 5శాతం నిధుల కోసం ఢిల్లీలో ఫిబ్రవరి 10న ధర్నాకు జిల్లా నుండి తరలివెళ్లిన ఎన్.పి.ఆర్.డి శ్రేణులు

భువనగిరి 07 ఫిబ్రవరి 25 తెలంగాణవార్త రిపోర్టర్:- వికలాంగుల పెన్షన్ లొ కేంద్ర ప్రభుత్వం వాటా 5వేలకు పెంచాలని,2025-26 బడ్జెట్లొ 5శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి10న ఢిల్లీలో ఎన్.వి.ఆర్.డి కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న వికలాంగుల మహాదర్నకు యాదాద్రి భూవనగిరి జిల్లా నుండి ఎన్.పి.ఆర్.డి నాయకులు కార్యకర్తలు,వికలాంగుల శుక్రవారం రోజు తరలివెళ్లినారు.ఈ సందర్బంగా ఎన్.వి.ఆర్.డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో వికలాంగులకు అన్యాయం చేసిందని అన్నారు.పెన్షన్ పెంపు కోసం బడ్జెట్లొ నిధులు కేటాయించకుండా మోసం చేసిందని అన్నారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలకు నిధులు కేటాయించకుండా ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం చేసిందని అన్నారు.మోడీ ప్రభుత్వం పాలనలో వికలాంగులు అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు.ఇందిరా గాంధీ నేషనల్ వికలాంగుల పెన్షన్ స్కీం వికలాంగులందరికి వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్నా వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకీ ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలొఎన్.పి.ఆర్.డి జిల్లా వరికింగ్ ప్రెసిడెంట్ బొల్లపెల్లీ స్వామి జిల్లా కోశాధికారి కొత్త లలిత జిల్లా ఉపాధ్యక్షులు మెరుగు బాబు డివిజన్ కార్యదర్శి గడ్డం యాదగిరి జిల్లా నాయకులు వేముల బిక్షం మండల అధ్యక్షులు ఎర్రవెల్లి నాగేశ్వర్ పండాల శ్రీహరి పి.విజయ్ కుమార్ శతరాశి నరేష్, బానోతు హరి,టి రవి,కె బిక్షమయ్య తదితరులు హాజరయ్యారు.