వయోవృద్ధుల సంక్షేమానికి కృషి
జోగులాంబ గద్వాల 18 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ తెలిపారు. దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవానికి సంబంధిం చిన గోడ పత్రికలను మంగళవారం కలెక్టర్ చాంబర్లో సీనియర్ సిటిజన్ ఫోరం నేతలు, సంబంధిత శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 19న గద్వాల ఐడిఓసి సమావేశ మందిరంలో వయోవృద్ధుల దినోత్సవంను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని సునంద, సీనియర్ సిటిజన్ ఫోరం జిల్లా అధ్యక్షులు మోహన్ రావు, ఎన్జీవో ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.