లారీ డ్రైవర్ యునియన్ నూతన అధ్యక్షుడు ఎంపిక

Jul 29, 2025 - 20:57
 0  19
లారీ డ్రైవర్ యునియన్ నూతన అధ్యక్షుడు ఎంపిక

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ లారీ డ్రైవర్ యునియన్ కమిటి ఎన్నిక ఆత్మకూరు ఎస్ మండలం లోని ఏపూర్ గ్రామం లో లారీ డ్రైవర్ యూనియన్ నూతన కమిటి నీ మంగళవారం ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అందరి సమక్షంలో  అధ్యక్షులు గా రావుల ఉదయ్ ఉప అధ్యక్షులు గా కప్ప సైదులు ప్రధాన కార్యదర్శి గా బండి ఉపేందర్ కార్యదర్శిగా గోదల భిక్షం కోశాదికారిగా గండమల్ల రవి  ను. ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గా ఎన్నికైన రావుల ఉదయ్ మాట్లాడుతూ తన పై నమ్మకం తో ఏక గ్రీవంగ ఎన్నుకున్న యూనియన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబా,వెంకటమల్లు,వెంకన్న,ఐపాష, లింగయ్య,హసినోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.