లగ్జరీ బస్సులో అక్రమంగా ఆవులు తరలింపు
బీహార్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ ప్రైవేట్ లగ్జరీ బస్సులో కొన్ని ఆవులను బీహార్ నుంచి పశ్చిమ బెంగాల్‌కు తీసుకువస్తున్నారు. అప్పుడు దారిలో అకస్మాత్తుగా ఓ ఆవు బస్సు నుంచి కిందపడింది. ప్రజలు బస్సును ఆపి లోపలికి చూడగా అందులో చాలా ఆవులు కట్టి ఉన్నాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. బస్సు డ్రైవర్ను మందలించంగా పారిపోయాడని సమాచారం. ప్రస్తుతం, ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.