లక్ష డప్పులు వేయి గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

మండల అధ్యక్షులుగా బాలెంల మల్లేష్ ఏకగ్రీవంగా ఎన్నిక

Jan 4, 2025 - 16:04
Jan 4, 2025 - 16:38
 0  97

అడ్డగూడూరు 04 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో  ఎం.ఆర్.పి.ఎస్ మండల అధ్యక్షులు సూరారం రాజు మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఫిబ్రవరీ7న నిర్వహించ తలపెట్టిన లక్ష డప్పులు వేయి గొంతుల కార్యక్రమం విజయవంతం చేయుటకై మాదిగ కళామండలి  మండల కమిటీ ఏర్పాటుకొరకు సూర్యాపేట మాదిగ కళ మండలి జిల్లా అధ్యక్షులు ఎర్ర అందీప్ మాదిగ తుంగతుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ చిప్పలపల్లి మల్లేష్ మాదిగ వంగూరి నరేష్ మాదిగ ఇంచార్జ్ లుగా హాజరై నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో  పలువురు మాట్లాడుతూ..మంద క్రిష్ణ మాదిగ తలపెట్టిన ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకై ప్రతి ఇంటి నుండి మాదిగ బిడ్డ ఒక సైనికుడై తమ కళారుపాలను ప్రదర్శించుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ కోరారు.మండల అధ్యక్షుడిగా బాలెంల మల్లేష్ మాదిగ ఉపాధ్యక్షుడిగా మేకల తరుణ్ మాదిగ ప్రధాన కార్యదర్శిగా మందుల నవీన్ కుమార్ మాదిగ కార్యదర్శిగా బోడ యాదగిరి కోశాధికారిగా చిప్పలపల్లి తేజ సంయుక్త కార్యదర్శిగా ఊడుగు మల్లేష్ మాదిగ మిగతా కార్యవర్గ సభ్యులకు నియామక పత్రం అందజేయడం జరిగింది.బాలెంల మల్లేష్ మాట్లాడుతూ..నాపై నమ్మకంతో ఎన్నుకున్న వారికి కృతజ్ఞతలు తెలుపుతూ కార్యక్రమం విజయవంతం కోసం నా వంతు పాత్ర పోషిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎం.ఆర్.పి.ఎస్ అధికార ప్రతినిధి పనుమటి సతీష్ మాదిగ ప్రధాన కార్యదర్శి బాలెంల నరేష్మాదిగ ఉపాధ్యక్షులు మందుల జానీ మాదిగ, జిల్లా రాకేష్,సీనియర్ నాయకులు దర్శనలా సతీష్ మాదిగ,ఎడ్ల వెంకటయ్య, మాదిగ,బోనాల నరేందర్,గజ్జెల్లి కృష్ణ,చిప్పలపల్లి సుధాకర్ మాదిగ బుర్రు ప్రభాకర్ మాదిగ,తీగల సైదులు, ఊడుగు మారయ్య తదితరులు పాల్గొన్నారు.