ఘనంగా ముగిసిన భజన సప్తాహం

Jul 26, 2025 - 18:47
 0  4

.. పాదయాత్రతో పవిత్ర కృష్ణా జలాలతో అభిషేకాలు .

జోగులాంబ గద్వాల 26 జూలై 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: మల్దకల్ ఆదిశిల క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గత శనివారం నుండి నిర్వహించిన భజన సప్తాహం శనివారంతో ఘనంగా ముగిసింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని పలు గ్రామాల భజన మండలి భక్తులు పాల్గొని దైవ నామ సంకీర్తనలు ఆలపించి సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ పలువురు స్వామివారి సేవలో తరించారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం కృష్ణా నది జలాలతో పాదయాత్ర ద్వారా మల్దకల్ గ్రామానికి చేరుకున్న వాల్మీకి పూజారులు అర్చకులు దేవత విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయంలో మూలవిరాట్యుతోపాటు గోవిందరాజస్వామి ఆంజనేయ స్వామి శివాలయంలో అభిషేకం నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సత్య చంద్రారెడ్డి పట్వారి అరవిందరావు మధుసూదనాచారి గ్రామస్తులు భక్తులు భజన మండలి సభ్యులు పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం భజన మండలి సభ్యులను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా సప్తాహ భజనకు సహకరించిన భజన మండలి సభ్యులు అన్నదాన దాతలు గ్రామస్తులు భక్తులకు దేవాలయ సిబ్బందికి ఆలయ సిబ్బందికి యోగేశ్వర భజన కళాకారుల సమితి అధ్యక్షుడు ప్రసాద్ చారి హార్మోనిస్ట్ పచర్ల రాఘవేంద్ర చారి కి చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు,ఈవో సత్య చంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సప్తహభజన కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు నల్లారెడ్డి పెద్దొడ్డి, రెండవ రోజు ఐజ బోజ్జయ్య, మూడవరోజు రాముడు ఆరగిద్ద, 5వ రోజు మంగలి మల్దకల్ మల్దకల్, ఆరవ రోజు సిద్దు నర్సింలు అండ్ బ్రదర్స్ మల్ధకల్, అలాగే చివరి రోజు బి.ఎన్. నర్సింలు శేషంపల్లి గ్రామం వాస్తవ్యులు అన్నదానం నిర్వహించారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333