లంబాడి హక్కుల సాధన వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేసిన మాజీ మంత్రి,సత్యవతి రాథోడ్

మహబూబాబాద్ 26 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- లంబాడీల ఐక్య వేదిక డోర్నకల్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 26 శనివారం రోజున భవ సంగ్ మహారాజ్ మరియు మ్యారమా యాడి మాకుల క్షేత్రంలో జరిగే గోరు సదస్సు పోస్టర్ను లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త జాదవ్ రమేష్ నాయక్ ఆధ్వర్యం లో మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ వారి నివాసం మహబూబాబాద్ లో ఆవిష్కరించడం జరిగినది. తెలంగాణ రాష్ట్రంలో లంబాడీల అస్తిత్వాలను పద్ధతి ప్రకారం కొంతమంది సమూలంగా విస్మరించి అట్టి స్థానాలలో బ్రాహ్మణ వ్యవస్థకు సంబంధించిన దేవీ దేవతల పేర్లు పెడుతూ మా యొక్క క్షేత్రాలను మేము వాడుక భాషలో వాడే పేర్లను కాకుండా ఇతర పేర్లతో చలామణి చేయడానికి సిద్ధమవడం బాధాకరం.హాతిరామ్ మహారాజ్ స్వయాన మా యొక్క గోరుమాటిల బిడ్డ అలాగే హథీ రామ్ మహారాజ్ స్వయాన బాలాజీ దేవుడి యొక్క భక్తుడు అలాగే ఆయనతో ఆడుకున్న గొప్ప భక్తుడు మా జాతి ఆరాధ్య దైవం అలాగే మాకుల క్షేత్రంలో ఉన్న భావ సంగ్ మహారాజ్ స్వయానా బాలాజీ మహారాజ్ భక్తుడు అలాగే సేవియా సాద్ బాలాజీ మహారాజ్ భక్తుడు వీళ్ళందరూ అలాగే మా యొక్క ఆరాధ్య దైవం సద్గురువు సేవాలాల్ మహారాజ్ దండి మ్యారామ యాడిని వారి వారి క్షేత్రాలలో స్థాపించడం జరిగినది.అలాంటి మ్యారామా యాడీ లేదా దండి మ్యారామా యాడీ లేదా జగజ్జనని జగదాంబ యాడీ యొక్క పేర్లను మార్చి మారెమ్మలుగా మైసమ్మలుగా చలామణి చేస్తూ ఆదివాసి గిరిజన లంబాడీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడంగా భావించాల్సి వస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాకుల పూజారి సీతారాం బానోత్,లంబాడీల ఐక్య వేదిక జిల్లా విద్యార్థి విభాగం సమన్వయకర్త బాసు నాయక్, లంబాడి లైక్ వేదిక మరిపెడ మండల సమన్వయకర్త దేవేందర్ నాయక్, లంబాడీల ఐక్య వేదిక మరిపెడ ఇన్చార్జి దేవేందర్ నాయక్, వెంకట తండా సమన్వయ జాటోత్ రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.