నేడు వరంగల్ సభను విజయవంతం చేయండి ప్రవీణ్ కందుకూరి

తిరుమలగిరి 27 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
నేడు వరంగల్ లో జరిగే బిఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కందుకూరి ప్రవీణ్ కోరారు శనివారం నాడు తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవ వేడుకలకు తెలంగాణ అభివృద్ధి ప్రదాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారని చెప్పారు తెలంగాణ రాష్ట్రం కోసం వీరోచితంగా పోరాడి తన ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా తెలంగాణ సాధించిన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనను ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారని ఆయన చెప్పారు, బూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదని అన్నారు గతంలో కేసీఆర్ ప్రభుత్వ హాయంలో ప్రజలందరికీ అనుకూలంగా సంక్షేమ పథకాలను అమలు చేశారని ఆయన చెప్పారు రైతు బంధు రైతు బీమా కేసీఆర్ కిట్టు కళ్యాణ లక్ష్మి దళిత బంధు ఉచిత విద్యుత్తు. ఆసరా పింఛన్లు లాంటి ఎన్నో పథకాలను అమలు చేశారని అని చెప్పారు నేడు రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఒక్క హామీ అమలు చేయకపోగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేశారని ఆయన చెప్పారు ఇప్పటికైనా ప్రజలు మేల్కొని రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీకే పట్ట0 కట్ట నున్నారని చెప్పారు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్, మాజీ మంత్రి సూర్యాపేట శాసన సభ్యులు గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు తుంగతుర్తి నియోజకవర్గంలో వేలాదిమందిగా తరలి వెళ్తున్నామని అని చెప్పారు ఈ విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు సంగే పాక రవి, బుషి పాక ఉదయ్, పల్లీల రంజిత్ ,భూక్య విజయ్ కుమార్, పానుగంటి భాస్కర్ కందుకూరి రాకేష్ కడియం శ్రీకాంత్, కడియం రమేష్ బోండ్ల నవీన్ కడియం అనిల్ చింత రమేష్ తదితరులు పాల్గొన్నారు