రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

తిరుమలగిరి 08 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్ల X రోడ్ వద్ద సోమవారం రాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాత్రి 10 గంటల సమయంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, తొండ గ్రామానికి చెందిన చెరుకు రాంబాబు అనే యువకుడు బైక్‌పై ప్రయాణిస్తున్నాడు. ఈ సమయంలో ధర్మారం గ్రామానికి చెందిన వ్యక్తి టాటా ఐస్ వాహనాన్ని వెనుక నుంచి రాంబాబు బలంగా ఢీకొట్టాడు. ప్రమాదములో తీవ్ర గాయాలు కావడం తో రాంబాబు స్పాట్లనే మృతిచెందాడు. రాంబాబు మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామంలో బంధువుల చావు కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు.