రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి
అడ్డగూడూరు11 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలో చౌళ్ళరామారం గ్రామం బొడ్డు గూడెం మధ్యలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న టోల్ గేట్ వద్ద రోడ్డు మార్గం ప్రమాదంలో ఉపాధ్యాయురాలు గుర్తు తెలియని వాహనం ఢీకొని మరణించడం జరిగింది. ఉపాధ్యాయురాలు తలపై నుండి గుర్తుతెలియని వాహనం వెళ్లడంతో తల మొత్తం నుజ్జు నుజ్జు అయిన వైనం,మృతురాలు మోత్కూర్ మండలం దాచారం గ్రామంలోని పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది.మంగళవారం నాడు అడ్డగూడూరు ఎంఈఓ ఆఫీసు నందు స్కూల్ కాంప్లెక్స్ సమావేశoకి ఉదయం తన సొంత ద్విచక్ర వాహనం పై బయలుదేరడం జరిగింది.ఈ క్రమంలో బొడ్డుగూడెం, చౌల్లరామారం, గ్రామాల మధ్యన ఏర్పాటు చేస్తున్నటువంటి నూతన టోల్గేట్ వద్ద ప్రమాదానికి గురై మరణించడం జరిగింది. మృతి చెందిన ఉపాధ్యాయురాలు పేరు ఎండి కుదసియా జబీనా బేగంవయసు 54, మృతురాలికి భర్త,ముగ్గురు కుమార్తెలు, ప్రస్తుతం దాచారం గ్రామంలోనే నివాసం ఉంటున్నారని మృతురాలి భర్త ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అడ్డగూడూరు ఎస్ ఐ డి నాగరాజు తెలిపారు.