రైతులకు 24 గంటలు కరెంటు సరఫరా చేయాలి

Sep 1, 2026 - 19:51
 0  1
రైతులకు 24 గంటలు కరెంటు సరఫరా చేయాలి

సబ్ స్టేషన్ దగ్గర రైతులు చేస్తున్న ధర్నా కు సంఘీభావం తెలిపిన బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి

_ బాసు హనుమంతు నాయుడు _

 జోగులాంబ గద్వాల 1 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల. నియోజకవర్గం గట్టు మండల కేంద్రంలో సబ్ స్టేషన్ ఆఫీస్ దగ్గర గట్టు మండలం రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులకు 24 గంటలు కరెంటు సరఫరా చేయాలని నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ తరఫున బాసు హనుమంతు నాయుడు  పాల్గొని, సంఘీభావం తెలిపారు.... అనంతరం,మండల కరెంట్ AE చెన్నయ్య కి వినతిపత్రం అందజేశారు... 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....

మండలంలోని కొంతకాలం నుండి కరెంటు వ్యవసాయ సాగుకు (3 Phase) కోతలు విధిస్తున్నారు అని అన్నారు.24 గంటలు ఉండాల్సిన కరెంటు 12 గంటలు మాత్రమే ఉంటుంది అని దీనికి కారణం మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు..కరెంట్ కోసం తెలంగాణ రాక ముందు ధర్నాలు చేస్తే,మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం లో చేయాలివస్తుంది అని అన్నారు...వ్యవసాయ పొలాలకు గత కెసిఆర్ ప్రభుత్వం 10 ఏళ్లు 24 గంటలు అందిచ్చిందని గుర్తు చేశారు.... ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు, పైగా ఆ 12 గంటల సమయంలో కూడా మధ్య మధ్యలో కరెంటు కోతలు ఉండడం ద్వారా రైతుల త్రీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో 24 గంటల పాటు కరెంటు ఉంటూ రైతు తనకు ఇష్టం వచ్చినప్పుడు తన పొలానికి నీటిని మళ్లించుకునేవాడు, కానీ నేడు ఈ కరెంటు కోతల వల్ల వేసుకున్న పంటలను ఎండ కొట్టుకునే పరిస్థితి వచ్చింది అని,పైగా ఎల్నినో ప్రభావంతో వర్షాలు కూడా ఈ సంవత్సరం రైతులకు సహకరించడం లేదు, దీనివల్ల పంటలు ఎండుతున్నాయి అని అన్నారు. 

వెంటనే,విద్యుత్ శాఖ అధికారులు స్పందించి రైతులకు 24 గంటలు కరెంటు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు...

ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మెన్ రాముడు, ఎస్.రాము నాయుడు, గద్వాల తిమ్మప్ప,ఉప సర్పంచు బాసు గోపాల్,trs వెంకటేష్,రాజు నాయుడు,జగదీష్,కంగారు తిమ్మప్ప, రాముడు, మల్లికార్జున్,నరసింహులు,రమేష్,నాగరాజు, పరశురాముడు,భీమేష్, లక్ష్మణ,రంగస్వామి, తిమ్మప్ప, వీరేష్, రామాంజనేయులు,ఆంజనేయులు,మరియు నాయకులు,రైతులు తదితరులు పాల్గొన్నారు....

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333