ఒంటరి మహిళ ను అవమానించిన తహసిల్దార్

Nov 12, 2025 - 21:23
Nov 13, 2025 - 18:47
 0  1

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ఒంటరి మహిళ ను అవమానించిన తహసిల్దార్. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి ఇసుక అనుమతి కెళితే బయటికి వెళ్లగొట్టడంటూ అవేదన. ఎన్ జి ఓ నని చూడకుండా కంటతడి పెట్టించి అవమాన పరిచిన తహసిల్దార్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్. *ఆత్మకూరు ఎస్..* ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లు కు ఇసుక కావాలని స్తానిక తహసిల్దార్ వద్ద కెళ్ళిన ఒంటరి మహిళ ను ఆఫీస్ నండి బయటికి వెళ్ళమని తహసిల్దార్ ఆవమాన పరిచిన సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే మండల పరిధిలోని నసీంపేట గ్రామానికి చెందిన ఒంటరి మహిళ సామాజిక కార్యకర్త వత్సవాయి లలిత కు ఒంటరి మహిళ కింద ఇటీవల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయింది. పునాది లెవెల్ లో పనులు అయ్యాక ఇసుక కొరత కారణంగా నిర్మాణం ఆగింది. బుధవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తాహసిల్దార్ ఇసుక అనుమతులు ఇస్తున్నట్లు సమాచారం తెలియడంతో స్థానిక రెవిన్యూ కార్యాలయానికి లలిత వెళ్లి ఇసుక అనుమతి కావాలని కోరినట్లు తెలిపింది. కొన్ని గ్రామాలకు ఇసుక అనుమతులు ఇచ్చిన తహసిల్దార్ ఒంటరి మహిళ అని కనీసం జాలి చూపకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ నీకు అనుమతులు ఇవ్వను దిక్కున్న కాడ చెప్పుకోమని అవమానపరిచినట్లుఆరోపించారు. కొంతమందికిచ్చి నాకెందుకు ఇవ్వరని అడిగినందుకు ముందు ఆఫీసు నుంచి బయటకు వెళ్ళమంటూ దుర్భశలాడి కంటతడి పెట్టించాడని బాధిత మహిళ ఆరోపించారు. తాహసిల్దార్ అమీన్ సింగ్ గతంలో కూడా ఇలాంటి సమస్య విషయం పై వెళితే తన ఇష్టానుసారంగా మాట్లాడినట్లు ఆరోపించారు. ఎన్జీవో గా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న ఒంటరి మహిళను ఒక ఉన్నత స్థాయి అధికారీ ఇష్టానుసారంగా మాట్లాడి దుర్భాషలాదడం పట్ల అవమానపరంగా భావించి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని లలిత డిమాండ్ చేశారు. *తహసిల్దార్ అమీన్ సింగ్ వివరణ.* ఒంటరి మహిళ ను అవమానించారు అని వచ్చిన ఆరోపణ ల పై తహసిల్దార్ అమీన్ సింగ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక గతం లో జాజి రెడ్డి గూడెం నుండి తెచ్చుకునేందుకు ఇచ్చాం మీరు తెచ్చుకోలేనపుడు మళ్ళీ ఇసుక అనుమతులు అని వస్తె ఎలా ఇవ్వాలి అన్నట్లు తెలిపారు. ఇసుక అనుమతులు ఇంకా ఎవరికి ఇవ్వలేదని అన్నారు. ఆమెను ఎలాంటి దుర్భశలాడలేదని అవమాన పరచ లేదన్నారు.