రైతులందరికీ యూరియా సరఫరా చేస్తాం.
జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణ రెడ్డి

అడ్డగూడూరు 04 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం కార్యాలయమును సందర్శించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటరమణారెడ్డి సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రైతులందరికీ సకాలంలో స్టాకు వచ్చిన యూరియా అందించాలని గురువారం రోజు పిఎసిఎస్ కు 20 టన్నుల యూరియా వచ్చిందని అన్నారు. ఉన్న స్టాకు కొంతమంది రైతులకు అందించారని అన్నారు. యూరియా అందని రైతులకు టోకెన్ ఇవ్వడం జరిగిందని అన్నారు.టోకెన్ ద్వారా మిగతా రైతులకు యూరియా స్ట్రాక్ రాగానే అందిస్తామని తెలిపారు. రైతుకు భూమిని బట్టి ఒకటి నుండి రెండు బ్యాగులు అందిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణారెడ్డి,ఎమ్మార్వో శేషగిరిరావు,ఏవో పాండురంగ చారి,పిఎసిఎస్ అధికారి వెంకటేశ్వర్లు, తదితరులు ఉన్నారు.