ప్రాపర్టీ నేరాలపై పూర్తి దృష్టి సాధించి కట్టి కేసులను
సరైన సాక్షాధారాలను సేకరించి సాంకేతికతను ఉపయోగించి త్వరగా కేసులను చేదించాలి. జిల్లా ఎస్పీ ప్రతి రాజ్.
జోగులాంబ గద్వాల 29 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- ఇటిక్యాల. ప్రాపర్టీ నేరాల పై పూర్తి దృష్టి సాధించి అట్టి కేసులలో సరైన సాక్ష్యాధారాలను సేకరించి సాంకేతికతను ఉపయోగించి త్వరగా కేసులను చేదించాలని జిల్లా ఎస్పీ రితిరాజ్,IPS పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ రోజు జిల్లా ఎస్పీ కొదండపుర్ లోని ఆలంపూర్ సర్కిల్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి పెండింగ్ లో ఉన్న NBWs ఎక్జిక్యూట్ గురించి, ఎలక్షన్స్ లలో ఎక్సైజ్, MCC వాయిలెన్స్ కేసుల గురించి, ప్రాపర్టీ కేసులు, పెండింగ్ UI , అరెస్ట్ పెండింగ్ కేసుల పై రివ్యూ నిర్వహించారు .
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ----- ప్రాపర్టీ నేరాల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని , నేరాలు జరిగిన వెంటనే తగిన సాక్ష్యాధారాలను సేకరించి సాంకేతిక పరిజ్ఞానo తో కేసులను త్వరగా చేదించాలనీ సూచించారు. ఇట్టి కేసులలో రిపీట్ నేరస్థులకు బెయిల్ రాకుండా PP ఒపీనియన్ తిసుకొని మేజిస్ట్రేట్ కు రిపోర్ట్ పెట్టాలని ఎస్సై లను ఆదేశించారు. ఆయా పోలీస్ స్టేషన్ ల పరిధిలో తరుచూ ప్రాపర్టీ నేరాలు జరిగే ప్రాంతాలను ఎంపిక చేసి అక్కడ పెట్రోలింగ్ తో పాటు రాత్రి సమయంలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. ఆయా ప్రాంతాలలో ప్రజలతో సమన్వయం చేసుకుంటూ కమ్యూనిటీ పోలీసింగ్ లో బాగంగా CC కెమెరాలు లేని చోట CC కెమేరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఆయా ప్రాంతాలలో విజిబుల్ పోలీసింగ్ ను మరింత పెంచాలని, వాహనాల తనిఖీలు నిర్వహించాలని సూచించారు. నేను సైతం కార్యక్రమం లో బాగంగా ఆయా షాప్స్ లలో, వ్యాపార సముదాయాలలో CC కెమేరాలు చేసుకునేటట్లు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత ఎన్నికల సమయంలో నమోదైన ఎక్సైజ్ కేసులలో పెండింగ్ లో ఉన్న వాటికి FSL రిపోర్ట్స్ తేపించుకొని కేసులను పూర్తి చేయాలన్నారు. MCC (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) కేసులలో, ప్రాపర్టీ సీజ్డ్ కేసులలో త్వరగా విచారణ పూర్తి చేసి కోర్టు లలో చార్జి షీట్ వేయాలని సూచించారు.
ఇతర జిల్లాల, రాష్ట్రాల సంబందించిన నిందితులను సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వారిని పట్టుకొని పెండింగ్ లో ఉన్న NBWs లను ఎగ్జిక్యూట్ చేయాలనీ ఆదేశించారు. ఇసుక, మోరం (మట్టి) అక్రమ రవాణా జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అన్నారు. UI లో ఉన్న ప్రాపర్టీ కేసులను పరిశీలించి అట్టి కేసులలో వెంటనే విచారణ పూర్తి చేసి కోర్టు లో చార్జి షీట్ వేయాలని సూచించారు. జాతీయ రహదారి పై పెట్రోలింగ్ ను మరింత పెంచాలని ఆలంపూర్ సి. ఐ నీ ఆదేశించారు. అయా కేసులలో అరెస్ట్ పెండింగ్ కు గల కారణాలను తెలుసుకొని అట్టి కేసుల్లో అరెస్ట్ పెండింగ్ లేకుండ ఉండేందుకు పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో డి. ఎస్పీ శ్రీ కె.సత్యనారాయణ , ఆలంపూర్ సి.ఐ రవిబాబు , గద్వాల్ సి. ఐ టాటా బాబు , ఎస్పీ సీసీ లోహిత్ కుమార్, ఆలంపూర్, ఇటిక్యాల, ఉండవెళ్ళి మరియు కోదండపుర్ ఎస్సై లు నాగరాజు, వెంకటేష్, శ్రీనివాస్ మరియు స్వాతి పాల్గోన్నారు.