రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలి. రైతు కార్మిక సంఘాలు 

Nov 26, 2025 - 18:51
Nov 26, 2025 - 19:07
 0  12

 జోగులాంబ గద్వాల 26 నవంబర్ 2025తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల కేంద్ర బిజెపి ప్రభుత్వం రైతాంగ,కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏ.వెంకటస్వామి వివి నరసింహ డిమాండ్ చేశారు బుధవారం సంయుక్త కిషన్ మోర్చా అఖిల భారత కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను మళ్లీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. గతంలో వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పే విధంగా తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా 18 నెలల పాటు సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న ఫలితాల్ని అనుభవించనియకుండా మళ్లీ వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. విద్యుత్ చట్టాన్ని అమలు చేయమని నాటి పోరాటం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని కానీ నేడు విద్యుత్  మోటార్లకు మీటర్లు బిగిస్తున్నదని విమర్శించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా, పంట మార్కెట్లను విస్తరించకుండా, విదేశాల నుండి వాణిజ్య పంటలను దిగుమతి చేసుకుంటూ స్వదేశీ రైతుల పొట్టలు కొడుతున్న బిజెపి విధానాలను రైతాంగం అర్థం చేసుకోవాలని కోరారు.సులభతర వాణిజ్యం పేరుతో స్వదేశీ కార్మికులను విదేశీ కార్పొరేట్ సంస్థ లకు బానిసలుగా చేయడమే దేశభక్తా అని ప్రశ్నించారు.కార్మికులకు వ్యతిరేకంగా యాజమాన్యాలకు అనుగుణంగా  44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లు గా మార్చి దేశ కార్మిక వర్గ ప్రయోజనాలను విదేశీయులకు తాకట్టు పెట్టారని విమర్శించారు. నాలుగు కార్మిక చట్టాల సవరణలు సైతం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఇవి యాజమాన్యాల కోడ్ లని కార్మికులకు ఉరితాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.విదేశీ సామ్రాజ్యవాదులతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నేడు బిజెపి ప్రభుత్వం సవరణ చేస్తూ దేశభక్తి గురించి నీతులు చెబుతున్నారని విమర్శించారు.కార్మికులు రైతులకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మిక చట్టాలను మారుస్తూ దేశాన్ని తిరోగమనం పాలు చేస్తున్న కేంద్ర బిజెపి విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతాంగ సమితి గోపాల్ యాదవ్, తెలంగాణ రైతు సంఘం సుంకాపురం మల్లేశ్, పౌర హక్కుల సంఘం సుభాన్,సిఐటీయూ ఉప్పేర్ నరసింహ,ఏఐటియుసి ఆశన్న, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఘట్టన్న ఖాజా, విష్ణు,భాస్కర్,మహేష్,నరసింహ, ఎల్లప్ప,పరశురాముడు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333