రేపు జోగులాంబ అమ్మవారి దర్శనం నిలిపివేత
జోగులాంబ గద్వాల 16 జనవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : అలంపూర్లో ని వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రేపు (శనివారం) మధ్యాహ్నం 1:00 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు జోగులాంబ అమ్మవారి దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో దీప్తి తెలిపారు. ఈనెల 19 నుంచి 23 వరకు జరిగే ఉత్సవాలకై ఆలయ శుద్ధి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అయితే, బాల బ్రహ్మేశ్వర స్వామి దర్శనం యథావిధిగా ఉంటుందని, భక్తులు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు.