రెండో రోజు ఐపీఎల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన అయిజ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్ర బృందం

రెండో రోజు ఐపీఎల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన అయిజ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్ర బృందం..సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని అయిజ పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ తిక్క వీరేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో అయిజ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో (ICA)అయిజ ప్రీమియర్ లీగ్ (IPL)సీజన్-09 నిర్వహించడం జరుగుతుంది. అయిజ మండల మాజీ సింగిల్ విండో అద్యక్షుడు స0కాపురం రాముడు, అయిజ మున్సిపల్ కౌన్సిలర్ సీఎం సురేష్ అన్నగార్ల. సహకారంతో నేడు రెండో రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐజ పట్టణ మరియు మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ను ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఐపీఎల్ నిర్వహకులు శాలువా, మెమెంటో తో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు నవదీప్, కరాటే వేణు, BRSV జిల్లా అధ్యక్షుడు మాల మల్లికార్జున్,క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.