రెండు ట్రాక్టర్లు పట్టివేత కేసు నమోదు
తిరుమలగిరి 03 ఆగస్టు 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మున్సిపాలిటీలోని అనంతారం బీకేర్ వాగు నుండి ఆక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా తమ ట్రాక్టర్ ల తో, అనంతారం నుండి తిరుమలగిరి కి మరియు తిరుమలగిరి నుండి వెలిశాల కు ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్ లను టీఎస్ 29 టి ఆర్ 9 4 5 2 గోడిశాల సోమన్న మరియు టీఎస్ 29 జే టి ఆర్ 1231 రెడ్డిమల్ల ప్రభాకర్ ఇరువురికి చెందిన ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేసి సీజ్ చేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఎస్ఐ వి సురేష్ మాట్లాడుతూ ఎవరైనా సంబందిత అధికారుల అనుమతి లేకుండ ఇసుక రవాణా చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు