రీసైక్లింగ్‌తో స్వచ్ఛ సూర్యాపేట సాధ్యం : చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది....

Mar 18, 2026 - 21:11
 0  1
రీసైక్లింగ్‌తో స్వచ్ఛ సూర్యాపేట సాధ్యం : చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది....

ప్రపంచ రీసైక్లింగ్ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్, వర్మీ కంపోస్ట్ యార్డ్ పరిశీలన...


 సూర్యాపేట, 19 మార్చి తెలంగాణవార్త ప్రతినిధి :-  “పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలిఅని ఇళ్ల వద్దనే తడి, పొడి వ్యర్థాలను వేరు చేయడం ద్వారా రీసైక్లింగ్ ప్రక్రియ సులభతరం అవుతుంది” అని మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి అన్నారు.ప్రపంచ రీసైక్లింగ్ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట మున్సిపాలిటీ కి సంబందించినజమునా నగర్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్, వర్మీ కంపోస్ట్ యార్డ్‌ను ఆమె మున్సిపల్ కమిషనర్ హన్మంత రెడ్డి తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వ్యర్థ ప్లాస్టిక్‌ను టైల్స్, ఇటుకలు, అక్యుప్రెషర్ మ్యాట్‌లుగా మారుస్తున్న విధానాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాలను సరైన విధంగా వినియోగించడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని తెలిపారు. రీసైక్లింగ్ ద్వారా వ్యర్థాలను ఉపయోగకరమైన వస్తువులుగా మార్చడం ఎంతో ప్రాముఖ్యమైందని పేర్కొన్నారు. ప్రజలు తమ ఇళ్లలోనే చెత్తను వర్గీకరించి ఇవ్వడం ద్వారా పారిశుధ్య కార్మికుల పనిభారం తగ్గుతుందని, పట్టణం మరింత పరిశుభ్రంగా మారుతుందని చెప్పారు.

 పట్టణాన్ని స్వచ్ఛ సూర్యాపేటగా తీర్చిదిద్దేందుకు మున్సిపాలిటీ అనేక చర్యలు చేపడుతోందని, అందులో భాగంగానే రీసైక్లింగ్ యూనిట్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రజల సహకారం లేకుండాఏ లక్ష్యాలు సాధ్యం కావని స్పష్టం చేశారు.
మున్సిపల్ కమిషనర్ హన్మంత రెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ ద్వారా మున్సిపాలిటీకి ఆదాయం కూడా లభిస్తున్నదని, దీనివల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు ఆర్థిక లాభాలు కూడా సాధ్యమవుతున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ మహమ్మద్ షఫీ ఉల్లా, శానిటరీ ఇన్‌స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్,ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ శివ ప్రసాద్,ప్రాసెసింగ్ ప్లాంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333