రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు

Mar 18, 2026 - 21:00
Mar 18, 2026 - 21:02
 0  0
రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు

ఈ పరాభవ నామ సంవత్సరంలో అన్నీ శుభాలే జరగాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ  తెలంగాణ వార్త ఎడిటర్ గిరీష్ కుమార్  తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాల ప్రజల అశలు చిగురించి.. ప్రతిఇంటా సిరులు పండాలని కోరారు. తెలుగు వారి కొత్త సంవత్సరంలో ప్రజలందరికీ మేలు జరగాలని ఆకాంక్షించారు. ప్రకృతితో మమేకమై.. వ్యవసాయ ఉత్పత్తి సంబంధాలలో పరస్పర సహకారం ప్రేమాభిమానాలతో పాల్గొనే సబ్బండ వర్ణాలకు.. ఉగాది గొప్ప పర్వదినం అని తెలిపారు. షడ్రురుచుల వలె అన్ని రంగాల ప్రజలు కలిసిమెలసి ఐక్యతతో ముందుకు సాగాలని.. ప్రకృతి అనుకూలించి రైతులతో పాటు ఉద్యోగ వ్యాపార అన్నిరంగాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333