రాష్ట్ర మహాసభను జయప్రదం చేయండి.
తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ.
తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ.
హైదరాబాద్ /ఆగస్టు 10.
హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ఆగస్టు 12న జరిగే తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర రెండవ మహాసభకు మాదిగ అనుబంధ కులాల జర్నలిస్టులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ కోరారు. ఆదివారం హైదరాబాదులో ఆయన విలేకరులతో మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు తమ జర్నలిస్ట్ ఫోరం పోరాటాలు చేస్తుందని చెప్పారు. ప్రభుత్వం జర్నలిస్టులకి అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలన్నారు. ఇంటి స్థలాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని న్యాయనిపుణులతో చర్చించి కోర్టు పరిధిలో ఉన్న సమస్యను పరిష్కరించి ఇంటి స్థలాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కోరారు. అంబేద్కర్ అభయ హస్తం పథకాన్ని ప్రభుత్వం వెంటనే ప్రారంభించి మొదటి దశలో మాదిగ అనుబంధ కులాల జర్నలిస్టులకు అవకాశం కల్పించి ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించేందుకే మాదిగ జర్నలిస్ట్ ఫోరం మహాసభలు నిర్వహిస్తుందని చెప్పారు.