రాష్ట్ర ప్రభుత్వానికి దేవాదాయ శాఖకు భక్తుల విజ్ఞప్తి

Apr 10, 2026 - 19:48
Apr 10, 2026 - 19:48
 0  1
రాష్ట్ర ప్రభుత్వానికి దేవాదాయ శాఖకు భక్తుల విజ్ఞప్తి
రాష్ట్ర ప్రభుత్వానికి దేవాదాయ శాఖకు భక్తుల విజ్ఞప్తి

2027 జూలై నెలలో రానున్న గోదావరి పుష్కరాలకు దివ్య క్షేత్రం భద్రాద్రి,

సాన ఘట్టాల వద్ద దేవతా మూర్తుల విగ్రహాలతో భక్తులను పరవశించే విధంగా స్నాన ఘట్టాలు రూపొందించండి. 

రాష్ట్ర ప్రభుత్వానికి దేవాదాయ శాఖకు భక్తుల విజ్ఞప్తి. 

ఈ పుష్కరాలకు ఒక కోటి మందికి పైగా భక్తులు భద్రాచలం వచ్చి పుష్కర విధులు ఆచరిస్తారని తెలుస్తోంది.

తెలంగాణ వార్త ఏప్రిల్ 10 స్టాఫ్ రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :- దక్షిణ అయోధ్యగా, పితృ ముక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న భద్రాచలం దివ్య క్షేత్రంలో దక్షిణ వాహినిగా పుణ్య గోదావరి నది ప్రవహిస్తున్నది. అరణ్యవాస సమయంలో శ్రీ సీతారామ చంద్ర స్వామి వారు దండకారణ్య ప్రాంతమైన ఈ భద్రాద్రి లో పర్యటించారు. ఆ సమయంలో అయోధ్యలో తండ్రి దశరథ మహారాజు మరణించడంతో, అరణ్యవాస దీక్షలో ఉన్న కారణంగా శ్రీ సీతరామ లక్ష్మణులు అయోధ్యకు వెళ్లలేదు, భరత శత్రువులు వశిష్టాధి వంశ గురువులు దండకారణ్య ప్రాంతానికి వచ్చి ఈ గోదావరి తీరంలో శ్రీరామసోదరు లచే పితృకార్యం నిర్వహింపజేశారు. ఈ కారణంగా భద్రాచలాన్ని పితృ ముక్తి క్షేత్రమని, శ్రీరాముని మోక్షరామునిగా పిలుస్తారు. ఈ మహా క్షేత్రంలో ప్రవహిస్తున్న పుణ్య గోదావరికి 20 27 జూలైలో గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. గోదావరి పుష్కరాలను దక్షిణ కుంభమేళాగా అభివర్ణిస్తారు.

ఈ పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు భక్తులకు సౌకర్యాలు, అభివృద్ధి పనులకు వెచ్చిస్తున్నట్లు తెలియ వస్తున్నది, భద్రాచలం లో ఇప్పుడున్న స్నాన ఘట్టాలకు అదనంగా నూతన స్నాన ఘట్టాలు నిర్మించాలని, భక్తుల సౌకర్యాలకు, అధిక సంఖ్యలో లెట్రిన్సు, బాత్రూములు, మొబైల్ మరుగుదొడ్లు, వాటర్ ట్యాప్స్, అధిక సంఖ్యలో పారిశుద్ధ్య పనులు, ఆరోగ్య వైద్య సేవలు మొదలగునవి భక్తుల సౌకర్యార్థం నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. 2015 సంవత్సరంలో వచ్చిన గోదావరి పుష్కరాలకు 70, 80 లక్షల మందికి పైగా భక్తులు భద్రాద్రిలో పుష్కర స్నానాలు ఆచరించి పుష్కరవిధులు నిర్వర్తించారని, 2027 పుష్కరాలకు ఒక కోటి మందికి పైగా భక్తులు పుణ్య గోదావరి పుష్కర స్నానాలు ఆచరిస్తారని అంచనాలు వేయడం జరుగుతోంది. జగద్గురు ఆదిశంకరాచార్య స్వామి వారు తన భరతఖండ పాదయాత్రలో దివ్య క్షేత్రం భద్రాచలం వచ్చి పుణ్య గోదావరిలో స్నానం ఆచరించి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం చేసుకున్నారని, అలాగే రామాలయ నిర్మాత భక్త రామదాసు, తూము నరసింహ దాసు, నిత్యాన్నదాత పమిడిగటం వెంకటరమణ హరిదాసు, కబీర్దాసు, మొదలగు మహనీయులు శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని సేవించి తరించారని క్షేత్ర పురాణాలు తెలియజేస్తున్నాయి.

చరిత్ర ప్రసిద్ధి చెందిన దివ్య క్షేత్రం భద్రాద్రిలో గోదావరి పుష్కరాల సందర్భంగా స్నాన ఘట్టాల వద్ద పార్వతీ పరమేశ్వరులు, సీతారాములు, జగద్గురు ఆది శంకరాచార్య, భక్త రామదాసు మొదలగు మహనీయుల విగ్రహాలను స్నాన ఘట్టాల వద్ద ఏర్పాటు చేసి, పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని, గోదావరి పుష్కరాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి కాక, చత్తీస్గడ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు భద్రాచలం వచ్చి పుష్కర విధులు ఆచరిస్తారని, కావున ప్రభుత్వం పుష్కరాల సందర్భంగా ప్రత్యేక దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు. 

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333