ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాలను పెంచాలి: డిఐఈఓ భాను నాయక్

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాలను పెంచాలి: డిఐఈఓ భాను నాయక్* ఆత్మకూర్ ఎస్... ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లను పెంచి వాటిని బతికించాలని జిల్లా ఇంటర్ విద్యా అధికారి భాను నాయక్ అన్నారు. గురువారం నెమ్మికల్ ప్రభుత్వ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత ఏడాది కన్నా ఈ ఏడాది 30% అడ్మిషన్లను పెంచే బాధ్యత అధ్యాపకులు తీసుకోవాలని సూచించారు. కళాశాల పరిసర ప్రాంతాల్లోని పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులను జూనియర్ కళాశాలలో చేర్పించాలన్నారు. విద్యార్థులకు అవసరమైన టాయిలెట్స్, లైబ్రరీ, రీడింగ్ రూమ్స్, తరగతి గదులు, ఫర్నిచర్, ఉచిత పాఠ్యపుస్తకాలను అందిస్తున్నామన్నారు. సూర్యాపేట జిల్లాలో 8 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయని వాటిల్లో ప్రవేశాల శాతం పెంచేందుకే స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.నెమ్మికల్ కళాశాలలో ఇప్పటివరకు 127 అడ్మిషన్లు జరిగాయని ఇంకా పెంచాల్సిన బాధ్యత అధ్యాపకులు తీసుకోవాలని కోరారు. ప్రతి తరగతిలో 40 మంది విద్యార్థులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు ప్రతి కళాశాలను ఒకసారి సందర్శించి అధ్యాపకులకు చూచనలు చేశానన్నారు. జిల్లాలో గతంలో 2200 అడ్మిషన్లు ఉన్నాయని ఈ ఏడాది 3500 కు పెంచే బాధ్యత తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపల్ గుణగంటి వెంకటేశ్వర్లు అధ్యాపకులు , అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు