బడుగు బలహీన వర్గాల & మహిళా శ్రేయోభిలాషి

Apr 16, 2026 - 19:45
 0  4
బడుగు బలహీన వర్గాల & మహిళా శ్రేయోభిలాషి

సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారికి ఘనంగా నివాళులు సమర్పించిన గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం. 

తెలంగాణవార్తఏప్రిల్ 16 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం : పెత్తందార్ల నిరంకుశ త్వంతో బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా మహిళలు బ్రతుకుతెరువు కోసంఅనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ, పెత్తందార్ల కబంధ హస్తాలలో అనేక ఇబ్బందులు పడుతూ బ్రతుకుతెరువు కష్టంగా ఉన్న సమయంలో, అంటరానితనం వివక్షతో బడుగు బలహీనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో, కష్టజీవులకు అండగా తానున్నానని ముందుకు వచ్చి ప్రజల కోసం పెత్తందారులతో పోరాడిన మహనీయుడు, సంఘ సంస్కర్త స్వర్గీయ వీరేశలింగం పంతులుగారి జన్మ దినం సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు సమర్పిస్తున్నట్లు గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామావజల. రవికుమార్ తెలిపారు. ముఖ్యంగా చిన్న వయసులో నే బాలికలకు తమకంటే అనేక సంవత్సరాలు పెద్దవారైన పురుషులతో బలవంతపు వివాహాలు జరిపించిన కారణంగా అనేక ఇబ్బందులు పడిన స్త్రీ జాతికి పునర్వివాహాల పేరుతో మహిళలకు అండగా నిలిచిన మహాత్ముడు వీరేశలింగం పంతులు గారికి జోహార్లు సమర్పిస్తున్నట్లు బ్రాహ్మణ సంఘ సభ్యులు తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333