రామభక్తునికి ఘన సత్కారం చేసిన బిజెపి జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి

జోగులాంబ గద్వాల 3 మే 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : ఐజ మండల కేంద్రంలో జోగులాంబ జిల్లా ధూప దీప నైవేద్య జిల్లా అధ్యక్షుడు చక్రవర్తి ఆచార్యులు గత పదిహేను సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి సందర్భంగా తమ భక్తిశ్రద్ధలతో 36000 116 బియ్యపు గింజలపై శ్రీరామ నామాన్ని లిఖించడంతో ఐదు లక్షల శ్రీరామ నామాన్ని పూర్తి చేసినందుకు చక్రవర్తి చార్యులు నిరంతరం రామనామ స్మరణ ధ్యేయంగా సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని ప్రజలలోకి నిరంతరం తీసుకువెళ్లడానికి తనకు ఉన్నటువంటి సమయాన్ని నిరంతరం కేటాయించి ధూప దీప నైవేద్య లో భాగంగా ఎంతో మంది అర్చకులను మేల్కొలుపుతూ సనాతన ధర్మాన్ని ఎల్లవేళలా ప్రజలకు భక్తులకు చేరవేస్తూ ఉండాలని సూచిస్తూ మమేకమై హిందూ ధర్మ పరిరక్షణ ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్నందుకు జోగులాంబ జిల్లా ధూప దీప నైవేద్య జిల్లా అధ్యక్షుడు చక్రవర్తి చారి లకు పూలమాలలు తలపాకతో ఘనంగా సత్కారం చేసిన జిల్లా బిజెపి మాజీ అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి, మండల బిజెపి అధ్యక్షుడు గోపాల్ కృష్ణ, నాగరాజు. వెంకటాచార్యులు నాగభూషణ శర్మ, లక్ష్మణ గౌడ్ అశోక్. గోపాల్, రిపోర్టర్ అమర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.