రాజ్యాధికారం -రిజర్వేషన్స్
అర్ధం కాని విషయం ఒకటి
రాజ్యాంగం ఏమిచెపుతుంది
వయోజకులకు ఓటుహక్కు కల్పించింది,
ఎక్కువ సాధించినవారు, అధికార పీఠం అధిరోహించొచ్చని..
దేశం లౌకిక రాజ్యం
కుల, మత,ప్రాంతాలు ఎన్నివున్నా,ఎవరి స్వేచ్చ వారిది
నచ్చిన వారికి ఓటు వేయవచ్చు
అధికారాన్ని అప్పచెప్పవచ్చు..
అయితే, బడుగు బలహీన వర్గాలు,
ప్రజలుగా రిజర్వేషన్స్ కావాలని పోరాడుచున్నారు.
మావాట మాకని పార్టీలను నిలదీస్తున్నారు,
సీట్లు కేటాయించమని సంవత్సరాలనుండి అభ్యర్థిస్తున్నారు. అడుగుచున్నారు..
రాజ్యాంగం స్ఫూర్తితో, ప్రజాస్వామ్యపద్ధతిలో
అందరు ఒకే పార్టీ పెట్టుకొని
ప్రజలను సంఘటిత పరుచుకొని
అవగాహన కల్పించుకొని
అభ్యర్థులను నిలబెట్టుకొని
ఎన్నికలలో గెలవచ్చును
అధికారం చెపట్టవచ్చు,అన్ని వెనుకబడిన, బడుగు వర్గాలకు
లబ్ది చేకూరుతుంది, పేదరికం నిర్ములాన జరుగుతుంది..
ఆదిపత్యం ఉంది అన్న భావనరాదు
అడుగుకోవాల్సిన పనిలేదు, ఎదురుచూడాలిసిన అవసరం, ఎవరిని తప్పుపట్టాలిసినది లేదు
మేధావులు ఒకటిగా ఆలోచించాలి?
గతాన్ని పక్కకు పెట్టాలి, ఐక్యమత్యముతో
ప్రయత్నం మొదలుపెట్టాలి
యువతను,మహిళలను చైతన్యపరచాలి,రాజ్యాంగ ఫలాలను సమంగా పొందాలి
సమ న్యాయం జరిగినట్లవుతుంది.
సమస్య పరిష్కారం అవుతుంది.
రచన.
కడెం.ధనంజయ
గ్రామం:చిత్తలూర్ మండలం: శాలిగౌరారం జిల్లా:నల్గొండ
(ఇది కేవలము ఒక ఆలోచన, అభ్యర్థన)