చెట్టు ఎండిపోతుంది
చెట్టు ఎండిపోతుంది
వయసు మల్లి
బలహీనమై
కొమ్మలొంగిపోయి
నీరు అందక
బెరడు వదులుతుంది
ఆకు రాలుతుంది
వేరు కదులుతుంది
పూత ఆగిపోయింది
మాను వంగిపోతుంది
పచ్చని చెట్టు
నీడ నిచ్చి
పువ్వులనిచ్చి
కాయ, పండు నిచ్చి
ఆకు నిచ్చి
ప్రాణవాయువును
పక్షికి గూడును
వంట చెరుకును
కావలసినవి సమాకూర్చింది
చివరకు ఎండిపోతుంది
పచ్చగున్నపుడు
పదిమంది సేద తీరేది
కాయో పండో తిని
కడుపు నింపుకొనేది
ఆశించేది, పూజించేది
ఎండి పోతున్నదని
ఎగ దిగా చూస్తున్నారు
నీరు పొసేవారు లేరు
సేద తీరే వారు లేరు
మాట్లాడేవారే లేరు
కాని వంటచెరుకుల
వంటింట్లో ఉంటుంది
కాటికీ చేరిన వారికొరకు
స్మశానానికి వస్తుంది
కాలి బూడిదనై మట్టిలో కలిసిపోతుంది
మనిషి జీవితం కూడ ఇంతే
వయసులో ఉన్నపుడు ఒకల
చితికిచిక్కిపోయినపుడు మరోల
మనిషి అయినా, మానైనా ఒకటే
పుట్టుట గిట్టుటకే.
రచన.
కడెం. ధనంజయ
చిత్తలూర్