**రాజేశ్వరపురం గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ 40 కుటుంబాలు రాజీనామా""శ్రీ దయాకర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిక**

Aug 31, 2025 - 18:54
 0  13
**రాజేశ్వరపురం గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ 40 కుటుంబాలు రాజీనామా""శ్రీ దయాకర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిక**

 *రాజేశ్వరాపురం గ్రామంలో BRS పార్టీకి 40 కుటుంబాలు రాజీనామా*  

 తెలంగాణ వార్త ప్రతినిధి రా వెళ్ళ.****శ్రీ దయాకర్ రెడ్డి  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక*.

 *మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి  చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరిక* 

 *నేలకొండపల్లి మండలంలో పేదల పెన్నిధి తెలంగాణ రెవిన్యూ, గృహ నిర్మాణం మరియు సమాచార శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి  గ్రామాలలో చేస్తున్న అభివృద్ధికి ఆకర్శితులై రాజేశ్వరాపురం గ్రామంలో BRS పార్టీకి 40 కుటుంబాలు రాజీనామా చేసి ఈ రోజు మంత్రి గారి క్యాంప్ కార్యాలయం ఇంచార్జి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీ తుంబూరు దయాకర్ రెడ్డి  ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరినారు* 

 పార్టీలోకి వస్తున్న వారికి దయాకర్ రెడ్డి  కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పాటు మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి  చేస్తున్న అభివృద్ధి చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారన్నారు.ఇందిరమ్మ ప్రభుత్వం లో పేద ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు.పేదలందరికి ఇందిరమ్మ ఇళ్ళు, రైతులకు రెండు లక్షల రుణమాఫీ,సన్న వడ్లకు బోనస్,మహిళలకు ఉచిత బస్సు,పేదలకు రెండోదల ఉచిత విద్యుత్,అనేక పథకాలు అమలు చేస్తుందని ఆయన అన్నారు.పార్టీలోకి వచ్చిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని ఆయన తెలిపారు.పొంగులేటి శ్రీనివాసరెడ్డి  చేస్తున్న అభివృద్ధి తో రానున్న రోజుల్లో

 BRS పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు ఉంటాయని ఆయన అన్నారు.త్వరలో జరగనున్న స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యం గా పని చేయాలని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు ,మాజీ మార్కెట్ చైర్మన్ శాఖమూరి రమేష్ ,జిల్లా కాంగ్రెస్ నాయకులు కొడాలి గోవిందరావు , కాంగ్రెస్ నాయకులునర్సయ్య,బచ్చకూరి నాగరాజు,నర్సయ్య,నంబూరు రామారావు, షేక్ మస్తాన్ గ్రామ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు...

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State