- రహదారులపై వాహనాలు అక్రమ పార్కింగ్ ప్రమాదం, నేరం
సంభందిత వ్యక్తులపై కఠిన చర్యలు తపవు.
వాహనం సీజ్, జరిమానా.
సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ హెచ్చరిక.
సూర్యాపేట, 24 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- రహదారులపై ఇష్టారాజ్యంగా, అక్రమంగా వాహనాలను పార్కింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా పోలీస్ ఎస్పీ నరసింహ ఐపీఎస్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేస్తామని, జరిమానాలు తప్పవు అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రహదారులపై ఎక్కడపడితే అక్కడ, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నిలపడం వల్ల తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపడం వల్ల రోడ్డు పై వెళ్లే ఇతర వాహనదారులు గమనించక ప్రందాలకు గురౌతున్నారు అన్నారు. రోడ్డుపై అక్రమ పార్కింగ్ చేయడం వల్ల ప్రమాదం జరిగి ఎవరైనా మరణిస్తే లేదా గాయపడితే, దానికి కారణమైన వాహనదారులకు నూతన చట్టాల ప్రకారం 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా తప్పదని స్పష్టం చేశారు. ప్రతి వాహనదారుడు సామాజిక బాధ్యతగా మెలగాలని, రోడ్డు భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించాలని కోరారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా పోలీసులు చేపట్టే తనిఖీలకు, చర్యలకు ప్రజలు, వాహనదారులు సహకరించాలని కోరారు.