నడిరోడ్డుపై బైక్ స్టంట్.. యువకుడు అరెస్ట్
మఠంపల్లి, 06 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- ప్రధాన సెంటర్‌లో బైక్‌పై ప్రమాదకర స్టంట్లు చేసిన యువకుడు పర్వతం గోపీచంద్ (19)ను పోలీసులు అరెస్ట్ చేశారు. జాన్‌పాడు-మట్టపల్లి రోడ్డులో ఒంటి చక్రంపై బైక్ నడుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. బైక్ సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. బైక్ ఇచ్చిన మామపై కూడా కేసు నమోదు చేశారు. రద్దీ ప్రాంతాల్లో స్టంట్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. స్పందించిన ఎస్సై ప్రవీణ్ కుమార్, సిబ్బందిని స్థానికులు అభినందించారు. పోలీసులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఘటన మఠంపల్లిలో చోటుచేసుకుంది.