ట్రాఫిక్ సమస్యల నివారణకు ప్రత్యేక చర్యలు: ఎస్పీ నరసింహ

Jul 23, 2026 - 21:00
 0  1
ట్రాఫిక్ సమస్యల నివారణకు ప్రత్యేక చర్యలు: ఎస్పీ నరసింహ
ట్రాఫిక్ సమస్యల నివారణకు ప్రత్యేక చర్యలు: ఎస్పీ నరసింహ

జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో వాహనాల రద్దీని నియంత్రిస్తూ, ట్రాఫిక్ సమస్యలను పూర్తిగా తొలగించడం ద్వారా ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించేందుకు పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా పోలీస్ ఎస్పీ నరసింహ ఐపీఎస్ తెలిపారు. గురువారం సూర్యాపేట కొత్త బస్టాండ్, దాని పరిసర రోడ్లను స్థానిక పోలీస్ అధికారులు, ఆర్టీసీ అధికారులతో కలిసి ఎస్పీ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రయాణికుల భద్రతపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. సాధారణ ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బస్టాండ్‌లోకి ఆర్టీసీ బస్సులు సజావుగా వచ్చి వెళ్లేలా ప్రత్యేక మార్గాలను (రూట్లను) ఏర్పాటు చేసుకోవాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. బస్టాండ్ చుట్టుపక్కల రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు రోడ్లపైకి రాకుండా, తమ పరిధిలోనే వ్యాపారాలు చేసుకోవాలని, లేనిపక్షంలో చర్యలు ఉంటాయని తెలిపినారు. బస్టాండ్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా స్థానిక పోలీస్, ట్రాఫిక్ సిబ్బంది ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ పర్యవేక్షించాలని ఆదేశించారు. పొరుగు ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులకు సూర్యాపేట పట్టణంలో ప్రయాణం సురక్షితంగా, సులభంగా ఉండేలా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు. 

ఈ కార్యక్రమంలో స్థానిక ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ట్రాఫిక్ ఎస్ఐ యాదవేందర్,  ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333